Operation Chabutra | రాత్రిపూట పెరుగుతున్న నేరాలు, న్యూఇయర్ దగ్గరికొస్తున్న నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మైలార్దేవ్పల్లి పోలీసులు మంగళవారం అర్ధరాత్రి ఆపరేషన్ చబుత్రను చేపట్టారు. ఇందులో భాగంగా అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతూ, వీధుల్లో కూర్చొని ముచ్చట్లు పెడుతున్న వారికి వార్నింగ్ ఇచ్చారు.
నిబంధనలు పాటించకుండా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా తెరిచి ఉన్న హోటళ్లు, పాన్షాపులను మూసివేయించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబరాబాద్ సీపీ ఆదేశాల మేరకు మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆపరేషన్ చబుత్ర నిర్వహించినట్లుగా ఇన్స్పెక్టర్ బి.సత్యనారాయణ తెలిపారు.