IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) భారీ స్కోర్ చేసింది. అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఢిల్లీ బ్యాటర్లు సమిష్టిగా కదం తొక్కారు. అక్షర్ పటేల్() కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా ఓపెనర్ కరుణ్ నాయర్(31) మరోసారి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో ఫినిషర్ అశుతోష్ శర్మ(37) సిక్సర్ల మోతతో జట్టుకు కొండంత స్కోర్ అందించాడు. దాంతో, ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఇప్పటివరకూ 198 రన్స్‌ను మాత్రమే ఛేదించిన గుజరాత్ ఈసారి రికార్డు సృష్టిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఢిల్లీ బ్యాటర్లు దంచికొట్టారు. ఓపెనర్లు అభిషేక్ పొరెల్(18), కరుణ్ నాయర్(31)లు మరోసారి శుభారంభం ఇచ్చి భారీ స్కోర్‌కు పునాది వేశారు. అయితే.. అర్షద్ ఖాన్ డేంజరస్ పొరెల్‌ను ఔట్ చేసి గుజరాత్‌కు బ్రేకిచ్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్(28) ఉన్నంత సేపు ధనాధన్ ఆడాడు. కరుణ్‌తో కలిసి వేగంగా ఢిల్లీ స్కోర్‌బోర్డును నడిపిస్తున్న రాహుల్‌ను ప్రసిధ్ కృష్ణ ఎల్బీగా వెనక్కి పంపాడు. ఆ కాసేపటికే నాయర్‌ను ఔట్ చేసి ఢిల్లీకి షాకిచ్చాడు. అయితే.. ట్రిస్టన్ స్టబ్స్(31) జతగా అక్షర్ పటేల్(39) రెచ్చిపోయాడు. వీళ్లిద్దరూ ధాటిగా ఆడడంతో ఢిల్లీ 10 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 105 రన్స్ చేసింది.
A screamer out of nowhere 🔥
🎥 Jos Buttler’s one-handed grab gives Prasidh Krishna his well deserved 4th wicket 💙
Updates ▶️ https://t.co/skzhhRWvEt#TATAIPL | #GTvDC | @gujarat_titans pic.twitter.com/AKL5P4PRIm
— IndianPremierLeague (@IPL) April 19, 2025
రషీద్ ఖాన్‌ను ఉతికేసి వీళ్లు తలా ఒక సిక్సర్ బాదారు. నాలుగో వికెట్‌కు 53 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని సిరాజ్ విడదీశాడు. టాపార్డర్‌ను కూల్చిన ప్రసిధ్ 18వ ఓవర్లో వరుస బంతుల్లో అక్షర్, విప్రజ్ నిగమ్(0)లను ఔట్ చేసి ఢిల్లీని మళ్లీ దెబ్బ కొట్టాడు. అయితే.. అదే ఓవర్లో రెచ్చిపోయిన అశుతోష్ శర్మ(37) లెగ్ సైడ్, ఫైన్ లెగ్ దిశగా సిక్సర్లు కొట్టాడు. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన డొనోవాన్ ఫెరారీ విఫలం కాగా.. సాయి కిశోర్ వేసిన 20వ ఓవర్లో అశుతోష్ పెద్ద షాట్ ఆడి బౌండరీ లైన్ వద్ద అర్షద్‌కు క్యాచ్ ఇచ్చాడు. అయితే.. చివరి బంతిని కుల్దీప్ యాదవ్(4 నాటౌట్) ఫోర్‌గా మలచడంతో ఢిల్లీ.. ఆతిథ్య జట్టుకు 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.