Sarangapoor | సారంగాపూర్ : సారంగాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన మేసు రమేష్ అనే వికలాంగుడు ఈ నెల 27 న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఖర్చుల నిమిత్తం తన పింఛన్లో సగం డబ్బులను రూ.2వేలు విరాళంగా అందజేశారు. ఈ నగదును జెడ్పీ మాజీ చైర్మన్ దావ వసంతకు శనివారం అందజేశారు.
మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామానికి జెడ్పీ మాజీ ఛైర్మన్ దావా వసంత వచ్చిన సందర్భంగా తనవంతుగా సహకారంగా అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తేలు రాజు, నాయకులు ఎండబెట్ల ప్రసాద్, సాంబారి గంగాధర్, జలందర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.