IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో గాసిప్స్ వేగంగా ప్రచారం అవుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid), కెప్టెన్ సంజూ శాంసన్(Sanju Samson)ల మధ్య మాటలు కరువయ్యాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ద్రవిడ్ ఈ గాలి వార్తలను ఖండించాడు. తనకు, కెప్టెన్ సంజూ శాంసన్‌కు మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తల్ని తోసిపుచ్చిన ఆయన.. ఇద్దరం జట్టు ప్రయోజనాలకే కట్టుబడి ఉంటామని వెల్లడించాడు.
‘అసలు ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో.. ఎవరు ప్రచారం చేస్తారో నాకు తెలియడం లేదు. సంజూ, నేను సఖ్యతగానే ఉన్నాం. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఇద్దరం కూడా జట్టు ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం. కెప్టెన్‌గా అతడు మేము తీసుకునే ప్రతి నిర్ణయంలో, ప్రతి చర్చలో భాగమవుతాడు’ అని ద్రవిడ్ వివరించాడు. దాంతో, కెప్టెన్, కోచ్ మధ్య వివాదం నెలకొందనే వార్తలకు చెక్ పెట్టాడు ద్రవిడ్.
అసలేం జరిగిందంటే.. ఏప్రిల్ 16న రాజస్థాన్, ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) మధ్య జరిగిన టై అయింది. దాంతో, సూపర్ ఓవర్ ఆడించారు. సూపర్ ఓవర్లో ఎవరిని ఆడించాలి అనే విషయంపై రాజస్థాన్ కోచ్ ద్రవిడ్.. జట్టు సభ్యులు చర్చించారు. అయితే.. వాళ్లతో పాటు శాంసన్ కూడా ఉండాల్సింది. కానీ, అతడు ఆ చర్చలో పాల్గొనలేదు. దాంతో, సంజూకు, కోచ్ ద్రవిడ్‌కు పడడం లేదని.. ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం మొదలెట్టారు కొందరు.
I knew there was definitely a rift within the setup when there were absolutely no discussions or chat in the dugout before the super over.Everyone was standing quite in a circle in the dugout.Look at Sanju’s hand signal in the first video,he is deliberately ignoring everyone. https://t.co/DfxmlwGgBG pic.twitter.com/688ji3MXrS
— Delhi Capitals Fan (@pantiyerfc) April 17, 2025
ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ అనే ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియో క్షణాల్లో వైరలైంది. దాంతో, తమపై దుష్ప్రచారం చేస్తున్న వాళ్లకు చెక్ పెట్టాలనుకున్న ద్రవిడ్.. సంజూతో స్నేహంగానే ఉన్నానని వెల్లడించాడు. 18వ ఎడిషన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ రెండే మ్యాచుల్లో గెలుపొందింది. ప్రస్తుతం ఏడో స్థానంలో ఉన్న సంజూ సేన ఏప్రిల్ 19 శనివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది.