AI Video | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence).. ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఇదే మాట. ఇప్పుడు ఇది సర్వాంతర్యామి అయిపోయింది. ఏఐ ద్వారా వింతలు వినోదాలు సృష్టిస్తున్నారు. 20 ఏళ్ల వయసు వారిని 80 ఏళ్ల వృద్ధులుగా, క్రికెటర్లను పండ్లు అమ్ముకునే వాళ్లుగా, బిలియనీర్లను మురికివాడల్లో నివసించేవాళ్లుగా.. ఇలా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా సృష్టించిన సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అలాంటి వీడియోనే ఇప్పుడు మరొకటి వెలుగులోకి వచ్చింది.
ఎప్పుడూ సీరియస్ లుక్స్, సంచలన నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు వణుకుపుట్టించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. భారత్‌లో రైతుగా మారితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆ ఊహకు రూపమిచ్చాడు ఓ నెటిజన్. ట్రంప్ పొలం గట్ల వెంబడి సైకిల్‌పై గడ్డిని మోస్తూ, ఆవులను తీసుకెళ్తున్నట్లు ఏఐ సాంకేతికతతో వీడియోని రూపొందించారు. అంతేకాదు.. గ్రామంలోని చెట్టుకింద స్నేహితులతో ముచ్చటిస్తున్నట్లు, దుకాణంలో చిన్నారులకు దీపావళి టపాసులు కొనిచ్చి సంప్రదాయ దుస్తుల్లో దివాళి వేడుకల్లో పాల్గొన్నట్లు ఈ వీడియో రూపొందించారు.
This video, created by Artificial Intelligence (AI), shows what US President Donald Trump would be like if he were a farmer in India.@realDonaldTrump pic.twitter.com/k7V0DjFiVu
— Mahesh 🇮🇳 (@Mahesh_2299) April 19, 2025
ఈ వీడియోకి నేపథ్య సంగీతంగా ‘బలగం’ చిత్రంలోని ఫేమస్ ‘తెల్లాతెల్లాని పాలదారలల్లే..’ అని సాగే పాటను జత చేశారు. అంతేకాదండోయ్ ట్రంప్ చెరకు రసం అమ్ముతున్నట్లు కూడా వీడియోని సృష్టించారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోలపై మీరూ ఓ లుక్కేయండి మరి.
#AI-Generated Video of #Donald Trump Selling #Sugarcane Juice pic.twitter.com/B9Ok1L8URj
— shinenewshyd (@shinenewshyd) April 14, 2025
Also Read..
Elon Musk | త్వరలో భారత్‌కు ఎలాన్ మస్క్.. స్వయంగా ప్రకటించిన టెస్లా బాస్
Inmates | ఆ దేశంలో తొలిసారి జైళ్లలో ‘సెక్స్ రూమ్’లు.. ఇక ఖైదీలు తమ భార్యలతో ఏకాంతంగా గడపొచ్చు
శాంతి ఒప్పందంపై పురోగతి లేకుంటే తప్పుకుంటాం