Inmates | ఆ దేశంలో తొలిసారి జైళ్లలో ‘సెక్స్ రూమ్’లు.. ఇక ఖైదీలు తమ భార్యలతో ఏకాంతంగా గడపొచ్చు
Inmates | ఇటలీ (Italy) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారి జైల్లో (Prison) ఖైదీలకు (Inmates) ‘ఏకాంత గదుల’ను (Sex Room) అందుబాటులోకి తెచ్చింది.
Inmates | ఇటలీ (Italy) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారి జైల్లో (Prison) ఖైదీలకు (Inmates) ‘ఏకాంత గదుల’ను (Sex Room) అందుబాటులోకి తెచ్చింది. ములాఖత్ సమయంలో తమ భాగస్వాములతో ఖైదీలు ఈ గదుల్లో ఏకాంతంగా గడపొచ్చు. ఖైదీలు తమ భాగస్వాములను ప్రైవేటుగా కలుసుకునే హక్కు ఉందని అక్కడి న్యాయస్థానం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది.
ఉత్తర ఇటలీలోని అస్టి కారాగారంలో ఉన్న ఓ ఖైదీ తాను మానసికంగా ఎంతో కుంగిపోయి ఉన్నానని, తన భార్యతో శారీరకంగా కలిసేందుకు అనుమతించాలంటూ కోర్టులో పిటిషన్ వేశాడు. అయితే అతని పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో అతను ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అక్కడ అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఖైదీలు తమ భాగస్వాములను ప్రైవేటుగా కలుసుకునే హక్కు ఉందని న్యాయస్థానం తీర్పు చెప్పింది. వాటిని అడ్డుకోవాలని చూడొద్దని జైళ్ల శాఖను ఆదేశించింది. యూరోపియన్ దేశాల్లో చాలా వరకూ ఖైదీల కోసం ఏకాంత గదులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది.
కోర్టు తీర్పుతో ఆ దేశ న్యాయ మంత్రిత్వ శాఖ గత వారం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఖైదీలను తమ భాగస్వాములతో ఏకాంతంగా గడిపేందుకు అనుమతించాలని పేర్కొంది. అంతేకాదు, సదరు గదిలో మంచం, టాయిలెట్ వంటి సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఖైదీలు తమ భాగస్వాములతో ఏకాంతంగా గడిపేందుకు రెండు గంటలు సమయం ఇవ్వాలని పేర్కొంది.
ఇటలీ వ్యాప్తంగా జైళ్లలో 62 వేల కంటే ఎక్కువ మంది ఖైదీలు ఉన్నారు. ఇది జైళ్ల సామర్థ్యం కంటే 21 శాతం ఎక్కువ. అంతేకాదు తరచూ ఖైదీలు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలే పెరిగిపోయాయి. అందుకు మానసిక ఒత్తిడే కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఖైదీల మానసిక పరిస్థితిని అర్థం చేసుకున్న కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుతో శుక్రవారం నుంచి ఖైదీల కోసం మొట్టమొదటి ‘సెక్స్ రూమ్’ ప్రారంభమైంది. సెంట్రల్ ఉంబ్రియా (central Umbria) ప్రాంతంలోని జైలులో ఓ ఖైదీని అధికారులుఏ ‘సెక్స్ రూమ్’కు అనుమతించారు. కాగా, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, నెదర్లాండ్స్, స్వీడన్ లాంటి యూరప్ దేశాల్లో ఖైదీల కోసం జైల్లలో ఈ తరహా ఏర్పాట్లు ఎప్పటి నుంచో ఉన్నాయి.
Also Read..
Indian Student Dead | కెనడాలో కాల్పులు.. భారతీయ విద్యార్థిని మృతి
US Sevis | వీసా రద్దయిన విద్యార్థుల్లో 50% మంది భారతీయులే..! ఆందోళనలో విద్యార్థులు
శాంతి ఒప్పందంపై పురోగతి లేకుంటే తప్పుకుంటాం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

