IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ 35వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి శుభారంభం దక్కింది. పవర్ ప్లేలో రనస్స్ చేసిన ఢిల్లీ భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. అయితే.. ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో బౌండరీ బాదిన కరుణ్ నాయర్(31) ఆ తర్వాత కట్ షాట్ ఆడి బౌండరీ వద్ద అర్షద్ ఖాన్ చేతికి చిక్కాడు. దాంతో, 93 వద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్(8), కెప్టెన్ అక్షర్ పటేల్(16)లు దూకుడుగా ఆడుతున్నారు. 10 ఓవర్లకు స్కోర్.. 105-3.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఢిల్లీ బ్యాటర్లు బ్యాటర్లు దంచేస్తున్నారు. టాపార్డర్‌లో అభిషేక్ పొరెల్(18), కరుణ్ నాయర్(31)లు మరోసారి శుభారంభం ఇవ్వగా.. అర్షద్ ఖాన్ ఈ జోడిని విడదీసి గుజరాత్‌కు బ్రేకిచ్చాడు. పొరెల్ తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్(28) ఉన్నంత సేపు ధనాధన్ ఆడాడు. వేగంగా ఢిల్లీ స్కోర్‌బోర్డును నడిపిస్తున్న రాహుల్‌ను ప్రసిధ్ కృష్ణ ఎల్బీగా వెనక్కి పంపాడు. అదే ఊపులో డేంజరస్ కరుణ్ నాయర్‌ను సైతం ఔట్ చేసి రెండో వికెట్ ఖాతాలో వేసుకున్నాడీ పేసర్.
Watch Prasidh Krishna’s brilliant swinging yorker to KL Rahul 🔽https://t.co/etPlbsyC7c#TATAIPL | #GTvDC https://t.co/3gno1PmGnv
— IndianPremierLeague (@IPL) April 19, 2025