రాయ్‌పూర్: ఐస్‌క్రీమ్ ఫ్యాక్టరీలో పని చేసే ఇద్దరు కార్మికులను యజమాని, అతడి అనుచరుడు కలిసి చిత్రహింసలకు గురిచేశారు. దొంగతనం ఆరోపణలపై విద్యుత్ షాక్‌లు ఇచ్చారు. (Workers Given Electric Shock) చేతి వేళ్ల గోళ్లు పీకడంతోపాటు వారిని కొట్టారు. అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయిన ఇద్దరు కార్మికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఖప్రభట్టి ప్రాంతంలోని ఐస్‌క్రీం ఫ్యాక్టరీలో రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాకు చెందిన అభిషేక్ భంబీ, వినోద్ భంబీ పని చేస్తున్నారు. ఏప్రిల్ 14న వారిద్దరూ దొంగతనం చేసినట్లు యజమాని చోటూ గుర్జార్ ఆరోపించాడు. తన అనుచరుడు ముఖేష్ శర్మతో కలిసి కార్మికుల చొక్కాలు విప్పించి చిత్రహింసలకు గురిచేశాడు. కరెంట్ వైర్‌తో వారికి విద్యుత్ షాకులు ఇచ్చాడు. పటకారుతో గోళ్లు పీకడంతోపాటు కర్రతో వారిని కొట్టారు.
కాగా, కార్మికులైన అభిషేక్, వినోద్ ఆ ఐస్‌క్రీం ఫ్యాక్టరీ నుంచి తప్పించుకున్నారు. రాజస్థాన్ భిల్వారాలోని సొంతూరుకు చేరుకున్నారు. యజమాని వేధింపుల గురించి గులాబురా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రూ.20,000 అడ్వాన్స్ అడిగినందుకు విద్యుత్ షాకులతో చిత్రహింసలకు గురి చేశారని వారు ఆరోపించారు. వేధింపులకు సంబంధించని వీడియో క్లిప్‌ను పోలీసులకు అందజేశారు.
మరోవైపు రాజస్థాన్ పోలీసులు ‘జీరో’ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తదుపరి చర్యల కోసం ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా పోలీసులకు ఈ కేసును బదిలీ చేశారు. దీంతో ఐస్‌క్రీం ఫ్యాక్టరీ యజమాని చోటూ గుర్జార్, అతడి అనుచరుడు ముఖేష్ శర్మపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. కాగా, కార్మికులకు విద్యుత్ షాక్ ఇచ్చి వేధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Chhattisgarh;भाजपा शासित राज्य दलितों के लिए नर्क से कम नहीं।14 अप्रैल को जब संविधान और समरसता की बातें हो रही थीं,उसी दिन छत्तीसगढ़ में दो दलित युवकों को फालूदा दुकान में मजदूर बनाकर लाया गया।मजदूरी मांगने पर उन्हें नंगा कर करंट दिया गया और बर्बरता से पीटा गया।@CG_Police pic.twitter.com/0t5gLtDWhT
— BSP Bihar (@BSP4Bihar) April 19, 2025