Australian Open : ఆస్ట్రేలియన్ ఓపెన్ (Australian Open) మెన్స్ సింగిల్స్ టైటిల్ (Mens singles title) ను మళ్లీ వరల్డ్ నెంబర్ 1 ఆటగాడు జెన్నిక్ సిన్నరే (Jannik Sinner) దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ – 2025 మెన్స్ సింగిల్స్ ఫైనల్లో ఇటలీ టెన్నిస్ దిగ్గజం సిన్నర్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వరెవ్ (Alexander Zverev) ను చిత్తుగా ఓడించాడు. జ్వెరెవ్ 6-3, 7-6 (7-4), 6-3 తేడాతో ఓటమి పాలయ్యాడు. ఈ ఇద్దరి మధ్య ఫైనల్ పోరు 2.42 గంటలపాటు ఆసక్తికరంగా సాగింది.
టోర్నీ ప్రారంభం నుంచి జోరు కనబర్చిన సిన్నర్.. ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించాడు. రెండో సెట్లో మినహా సిన్నర్‌కు ఏ దశలోనూ జ్వెరెవ్ సరైన పోటీ ఇవ్వలేకపోయాడు. దాంతో సిన్నర్ మూడు సెట్లలోనే మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. సిన్నర్‌కు ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌తోపాటు యూఎస్ ఓపెన్ టైటిల్‌ను కూడా సిన్నర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈసారి కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ దక్కడంతో మొత్తం టైటిళ్ల సంఖ్య 3కు చేరింది.
ఇదిలావుంటే ఈసారైనా ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకోవాలని భావించిన జ్వెరెవ్ ఆశలు ఆశలుగానే మిగిలిపోయాయి. 2020లో యూఎస్ ఓపెన్‌లో, గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో కూడా సిన్నర్ ఫైనల్‌కు చేరాడు. కానీ, టైటిల్ నెగ్గడంలో విఫలమయ్యాడు. మొత్తం మూడు సార్లు ఫైనల్లోకి అడుగుపెట్టినా గ్రాండ్ స్లామ్ టైటిల్ కల మాత్రం జ్వెరెవ్‌కు అందని ద్రాక్షగానే మిగిలింది.
Beating Retreat | అట్టారీ-వాఘా సరిహద్దుల్లో ఘనంగా బీటింగ్ రీట్రీట్.. Videos
Women U-19 T20 WC | మహిళల అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత్ జోరు.. బంగ్లాపై ఘన విజయం
Shubman Gill | ఒత్తిడివల్లే సరిగా ఆడలేకపోయా.. వైఫల్యంపై నిజం ఒప్పుకున్న గిల్
Tribal King | రిపబ్లిక్ డే వేడుకలకు తొలిసారి ఓ ట్రైబల్ కింగ్.. ఆ రాజు ఎవరో తెలుసా..?
Republic Day 2025 | ఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. ఆకట్టుకున్న శకటాలు.. Videos