AUSW vs SLW : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా (Australia) బంతితో అదరగొట్టింది. తొలి మ్యాచ్‌లో ఓటమితో కుంగిపోయిన శ్రీలంక(Srilanka)ను ఓ ఆట ఆడుకుంది. పేసర్ మేఘన్ షట్(3/12), యువ స్పిన్నర్ సోఫీ మొలినెక్స్(2/20)లు చెలరేగడంతో ప్రత్యర్థిని వంద లోపే కట్టడి చేసింది. లంక జట్టులో హర్షిత సమరవిక్రమ(23), నీలాక్షి డిసిల్వా(29 నాటౌట్)లు మాత్రమే ఆసీస్ బౌలర్లను ఎదుర్కొని కాసేపు క్రీజులో నిలబడ్డారు. దాంతో, చమరి ఆటపట్టు బృందం నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 97 పరుగులకే పరిమితమైంది. స్వల్ప లక్ష్యాన్ని తక్కువ ఓవర్లలోనే ఛేదించి రన్ రేట్ పెంచుకోవాలని ఆసీస్ భావిస్తోంది.
షార్జా క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు ఆస్ట్రేలియా బౌలర్లు చుక్కలు చూపించారు. పేస్ బౌలర్ మేఘన్ షట్(3/12) అత్యుత్తమ స్పెల్‌తో లంకను కూల్చింది. ఓపెనర్ విశ్మీ గుణరత్నే(0)ను డకౌట్ చేసి ఒత్తిడి పెంచింది.
A forgettable start to Sri Lanka’s World Cup campaign
🔗 https://t.co/2Aw2GehAU8 | #T20WorldCup pic.twitter.com/YxFwXbqJTN
— ESPNcricinfo (@ESPNcricinfo) October 5, 2024
ఆ కాసేపటికే కెప్టెన్ చమరి ఆటపట్టు(3)ను అష్ గార్డ్నర్ ఎల్బీగా పంపింది. దాంతో.. 6 పరుగుల వద్దే ఓపెనర్లు పెవిలియన్ చేరారు. ఆ తర్వాత హర్షిత సమరవిక్రమ(23), కవిష దిల్హరి(5)లు ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. కానీ, సోఫీ మొలినెక్స్(2/20) కవిశను ఎల్బీగా వెనక్కి పంపి లంకను దెబ్బ కొట్టింది. అయితే.. నీలాక్షి డిసిల్వా(29 నాటౌట్) జతగా సమరవిక్రమ స్కోర్‌బోర్డును నడిపించింది.
Stuck in the quicksand of a slow start, Sri Lanka never recovered, with Australia’s bowlers restricting them to 93-7 after 20 overs
🔗 https://t.co/2Aw2GehAU8 | #T20WorldCup pic.twitter.com/VhMou8SRaB
— ESPNcricinfo (@ESPNcricinfo) October 5, 2024
మూడో వికెట్‌కు 31 పరుగులు జోడించిన ఈ జంటను మొలినెక్స్ విడదీసింది. అంతే.. ఆ తర్వాత మేఘన్ షట్ బుల్లెట్ బంతులతో లోయర్ ఆర్డర్‌ను పెవిలియన్ పంపింది. ఆలౌట్ ప్రమాదం తప్పించుకున్న లంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేయగలిగింది.