Citroen -Jeep | ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు సిట్రోన్ (Citroen), జీప్ (Jeep) దసరా పండుగ సందర్భంగా కస్టమర్లకు స్పెషల్ ఆఫర్లు ప్రకటించాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి 31 వరకూ ఫెస్టివ్ క్యాంపెయిన్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్లలో స్పెషల్ సర్వీసులు, డిస్కౌంట్లు, సేల్స్ తర్వాత సర్వీసులపై ఎక్స్ క్లూజివ్ డిస్కౌంట్లు ఉన్నాయి.
సిట్రోన్ ఇండియా ఫ్రీ ఫెస్టివ్ చెకప్స్ ఆఫర్ చేసింది. ఫెస్టివ్ కేర్ కార్నివాల్లో భాగంగా కార్ కేర్ ట్రీట్ మెంట్‌పై లేబర్ చార్జీల్లో 15 శాతం రాయితీ, సెలెక్టెడ్ యాక్సెసరీలపై 50 శాతం, సెలెక్టెడ్ మర్చండైజ్ పై 30 శాతం వరకూ రాయితీ అందిస్తుంది. నాలుగు టైర్ల రీప్లేస్ మెంట్ తోపాటు ప్రతి కొనుగోలుపై రూ.1000 మర్చండైజ్ యాక్సెసరీస్ కూపన్ అందిస్తోంది.
జీప్ ఇండియా సైతం ఫెస్టివ్ సీజన్ లో భాగంగా ఫ్రీ ఫెస్టివ్ చెకప్ ఆఫర్లు అందిస్తున్నది. సెలెక్టెడ్ విడి భాగాలు, లేబర్ చార్జీలపై 10 శాతం రాయితీ ఆఫర్ చేసింది. అలాగే కార్ కేర్ ట్రీట్ మెంట్ పై15 శాతం చార్జీలు, సెలెక్టెడ్ యాక్సెసరీలపై 30 శాతం డిస్కౌంట్, సెలెక్టెడ్ మర్చండైజ్ మీద 50 శాతం రాయితీ ఆఫర్ చేస్తోంది. కొత్త కస్టమర్లు రూ.2000 విలువైన మర్చండైజ్ కూపన్ అందిస్తుంది.