శనివారం 04 జూలై 2020
Sports - Jul 01, 2020 , 09:54:49

ఆసీస్‌,జింబాబ్వే వన్డే సిరీస్‌ వాయిదా

ఆసీస్‌,జింబాబ్వే వన్డే సిరీస్‌ వాయిదా

మెల్‌బోర్న్‌:  ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి  విజృంభణ కొనసాగుతున్నది.  తాజాగా  కరోనా కారణంతో ఆస్ట్రేలియా, జింబాబ్వే   మధ్య జరగాల్సిన వన్డే సిరీస్‌ కూడా వాయిదా పడింది. మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతుండటంతో ఇరు దేశాల క్రికెట్‌ బోర్డులు ఈ నిర్ణయం తీసుకున్నాయి.  ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం  ఆగస్టులో ఆతిథ్య  ఆస్ట్రేలియాతో  జింబాబ్వే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడాల్సి  ఉంది.

త్వరలో రీషెడ్యూల్‌పై ఇరు బోర్డులు సంప్రదింపులు జరిపిన తర్వాత తేదీలను ప్రకటిస్తామని క్రికెట్‌ ఆస్ట్రేలియా ఇన్‌ఛార్జి సీఈవో  నిక్‌ హాక్లీ తెలిపారు. ఈ ఏడాది మార్చి 13న ఆసీస్‌ చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడింది. 


logo