BGT 2024-25 : మరో రెండు వారాల్లో సొంతగడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. ఓపెనింగ్ కాంబినేషన్ కుదరక తలలు పట్టుకున్న ఆస్ట్రేలియా సెలెక్టర్లకు బిగ్ రిలీఫ్. డేవిడ్ వార్నర్ వీడ్కోలు అనంతరం ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) జోడీ వేటలో పడిన వాళ్లకు సరైనోడే దొరికాడు. వార్నర్ వారసుడిగా అచ్చం అతడిలానే ధాటిగా ఆడగల సత్తా ఉన్న ఆ యువకెరటం పేరు నాథన్ మెక్‌స్వీనే (Nathan McSweeney). అవును.. అన్నీ కుదిరితే ఈ కుర్రాడే పెర్త్ టెస్టులో ఖవాజాతో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్ ఆరంభించడం ఖాయమనిపిస్తోంది.
ఇండియా ‘ఏ’తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ‘ఏ’ జట్టు తరఫున మెక్‌స్వీనే దంచికొట్టాడు. ఓపెనర్‌గా వచ్చిన అతడు భారత బౌలర్లను ఉతికేస్తూ 88 నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో భాగమయ్యాడు. కుడి చేతివాటం బ్యాటర్, స్పిన్నర్ కూడా అయిన ఈ యంగ్‌స్టర్ ఆసీస్ సెలెక్టర్లకు నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
Nathan McSweeney is all set to be named in Australia’s Test squad for the India series, to be announced after the second A game.
He will be slated as the opening partner of Usman Khawaja.
Australia went through rigorous selection measures and tested 4 players in the last 6… pic.twitter.com/UgcvCYvBDj
— Rohit Baliyan (@rohit_balyan) November 6, 2024
దాంతో, అతడి టెస్టు అరంగేట్రానికి వేళైందని ఆసీస్ మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు. అదేజరిగితే ప్రతిష్ఠాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఖవాజాకు జతగా.. పెర్త్ టెస్టులో మెక్‌స్వీన్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఆరంభించడం పక్కా అంటున్నారు క్రీడా విశ్లేషకులు. వార్నర్ సైతం తన వారసుడిగా కామెరూన్ బాన్‌క్రాఫ్ట్, మార్కస్ హ్యారీస్లను కాదని మెక్స్వీనేను ఎన్నుకున్నాడు.
నవంబర్ 22న భారత్, ఆసీస్‌ల మధ్య బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ షురూ కానుంది. 1999 అనంతరం తొలిసారిగా ఈ ట్రోఫీ ఐదు మ్యాచ్‌లుగా నిర్వహిస్తున్నారు. వరుసగా రెండు పర్యాయాలు కంగారూల గడ్డపై ఈ ట్రోఫీ గెలుపొందిన భారత జట్టు హ్యాట్రిక్ కొట్టేందుకు తహతహలాడుతోంది. మరోవైపు మూడోసారి ఓటమిని తప్పించుకునేందుకు ప్యాట్ కమిన్స్ సేన గట్టి పట్టుదలతో పోరాడనుంది.