Davis Cup Finals | ‘స్పెయిల్ బుల్’ వీడ్కోలు మ్యాచ్.. తరలిరానున్న టెన్నిస్ దిగ్గజాలు
Davis Cup Finals : టెన్నిస్ లెజెండ్, మాజీ వరల్డ్ నంబర్ 1 రఫెల్ నాదల్ (Rafael Nadal) వీడ్కోలు మ్యాచ్‌కు వేళైంది. డేవిస్ కప్ ఫైనల్స్‌తో స్పెయిన్ బుల్ తన సుదీర్ఘ కెరీర్ ముగించనున్నాడు. దిగ్గజమైన అతడి ఆఖరి పోరును చూసేందుకు టెన్నిస్ స్టార్లు తరలి రానున్నారు.
Davis Cup Finals : టెన్నిస్ లెజెండ్, మాజీ వరల్డ్ నంబర్ 1 రఫెల్ నాదల్ (Rafael Nadal) వీడ్కోలు మ్యాచ్‌కు వేళైంది. డేవిస్ కప్ ఫైనల్స్‌తో స్పెయిన్ బుల్ తన సుదీర్ఘ కెరీర్ ముగించనున్నాడు. దిగ్గజమైన అతడి ఆఖరి పోరును చూసేందుకు టెన్నిస్ స్టార్లు తరలి రానున్నారు. ఒకప్పుడు నాదల్ ప్రత్యర్థులైన రోజర్ ఫెదరర్‌తో పాటు నొవాక్ జకోవిచ్, బ్రిటన్ మాజీ ఆటగాడు ఆండీ ముర్రేలు హాజరు కానున్నారు. ఈ విషయాన్ని టోర్నమెంట్ డైరెక్టర్ ఫెలిసియానో లోపెజ్ వెల్లడించాడు.
స్వదేశంలో జరుగబోయే డేవిస్ కప్ ఫైనల్స్ 8వ సీజన్ నాదల్కు ఫ్రొఫెషనల్ ప్లేయర్‌గా ఆఖరి మ్యాచ్. అక్కడి మలగాలో నవంబర్ 19వ తేదీన ఈ టోర్నీ మొదలు కానుంది. ఆరు రోజుల పాటు సాగే డేవిస్ కప్ ఫైనల్స్‌లో రఫా చివరిసారిగా దేశం తరఫున బరిలోకి దిగుతున్నాడు. దాంతో, అతడి విజయం సాధించాలని అభిమానులంతా కోరుకుంటున్నారు.
Reflexes of a cat and the touch of silk ✨
Rafael Nadal has always excelled at the volley and here’s a top 5 from Roland-Garros 🍭 pic.twitter.com/y94kqa3kN2
— Roland-Garros (@rolandgarros) November 6, 2024
టెన్నిస్ యోధుడైన నాదల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించి అతడికి ఘన వీడ్కోలు పలకాలని ఫెదరర్, జకోవిచ్, ముర్రేలతో పాటు పలువురు టెన్నిస్ స్టార్లు భావిస్తున్నారు. దాంతో, ఇప్పుడు అందరి కళ్లన్నీ డేవిస్ కప్ ఫైనల్స్ మీదు ఉన్నాయి. అక్టోబర్‌లోనే వీడ్కోలు ప్రకటన చేసిన నాదల్ చివరి టోర్నీగా డేవిస్ కప్ ఫైనల్స్ ఆడుతానని చెప్పిన విషయం తెలిసిందే.
Mil gracias a todos
Many thanks to all
Merci beaucoup à tous
Grazie mille à tutti
谢谢大家
شكرا لكم جميعا
תודה לכולכם
Obrigado a todos
Vielen Dank euch allen
Tack alla
Хвала свима
Gràcies a tots pic.twitter.com/7yPRs7QrOi— Rafa Nadal (@RafaelNadal) October 10, 2024
‘నవంబర్‌లో మలగాలో జరుగబోయే డేవిస్ కప్‌లో స్పెయిన్ తరఫున చివరిసారి ఆడుతా. నిజం చెప్పాలంటే.. గత కొన్ని ఏండ్లు చాలా కష్టంగా గడిచాయి. మరీ ముఖ్యంగా గత రెండు ఏండ్లు ఎన్నో బాధలు పడ్డాను. ఎంతో ఇష్టమైన ఆటకు వీడ్కోలు పలకడం ఎంతో కష్టమైన నిర్ణయం. అందుకు నాకు ఎంతో సమయం పట్టింది. అయితే.. జీవితంలో ప్రతిదానికి ఆరంభం ఉన్నట్టే ముగింపు కూడా ఉంటుంది’ అని నాదల్ తన వీడ్కోలు ప్రకటనలో తెలిపాడు. కెరీర్లో 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలుపొందిన రఫా గాయాలతో వేగలేక ఈ నిర్ణయం తీసుకున్నాడు.
సంచలనంగా దూసుకొచ్చి..
స్పెయిన్ బుల్గా పేరొందిన నాదల్ టెన్నిస్ దిగ్గజ ఆటగాళ్లలో ఒకడు. రోజర్ ఫెదరర్, ఆండీ రాడిక్, లీటన్ హెవిట్.. వంటి దిగ్గజాలు టెన్నిస్‌ను ఏలుతున్న రోజుల్లో నాదల్ అరంగేట్రం చేశాడు. సంచలనంగా దూసుకొచ్చిన నాదల్ అద్భుత విజయాలతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. పదునైన సర్వీస్, బలమైన బ్యాక్ హ్యాండ్ షాట్లతో విరుచుకు పడే రఫా.. దిగ్గజాలకు షాకిస్తూ కెరీర్లో 22 గ్రాండ్‌స్లామ్స్ గెలిచాడు.
Imagine winning a grand slam tournament 14 times.
Imagine winning every single final you played.
Imagine never even going to a 5th set in ANY OF THEM.
That is the legacy of Rafael Nadal Parera.
🇪🇸 👑 pic.twitter.com/3UUkKoiemw
— Swish 🍒 Tennis (@Zwxsh) November 4, 2024
అయితే.. గాయాలు వెంటాడడంతో కొన్నిరోజులు టెన్నిస్‌కు దూరమయ్యాడు. తొడకండరాల గాయం అతడిని మాటిమాటికీ ఇబ్బంది పెట్టింది. అయినా గోడకు కొట్టిన బంతిలా కోర్టులో అడుగపెట్టడం తనకేమీ కొత్త కాదని నిరూపిస్తూ రాకెట్ అందుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో గాయం కారణంగా ఆటకు దూరమైన.. ఇక ఎంతోకాలం ఆడలేనని భావించాడు. అయినా సరే కోలుకున్నాక మళ్లీ రాకెట్ అందుకున్నా విజేతగా నిలవలేకపోయాడు.
ఇవి కూడా చదవండి
- Mancherial | ఎమ్మెల్యే వివేక్ ఎదుటే తన్నుకున్న కాంగ్రెస్ నాయకులు
- Road Accident | మాదాపూర్‌లో ఘోర ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు
- Woman, Daughter, Sons Shot Dead | మహిళ, కుమార్తె, కుమారులు కాల్పుల్లో మృతి.. మరో చోట భర్త మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

