Road Accident | హైదరాబాద్ : హైదరాబాద్‌లోని మాదాపూర్ వద్ద బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
బంజారాహిల్స్ నుంచి హైటెక్ సిటీ వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి మాదాపూర్ వద్ద మెట్రో పిల్లర్లకు చెందిన డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు గాల్లో ఎగిరిపడింది. వ్యతిరేక దిశలో వెళ్లి కారు ఆగింది. దీంతో వాహనాలన్నీ ఆగిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గాయాలపాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అయితే కారు డ్రైవర్ తప్పించుకుపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Drugs | రూ.2.30కోట్ల విలువైన డ్రగ్స్, గంజాయి దహనం
CV Anand | ఈ ఏడాది సైబర్ నేరాలు పెరిగాయి.. డిజిటల్ అరెస్టులు ఆందోళనకరం : సీపీ ఆనంద్
Hyderabad | బంజారాహిల్స్‌లో మహిళా కానిస్టేబుల్‌పై దాడి చేసిన దుండగులు