సిటీబ్యూరో, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): వివిధ కేసుల్లో పట్టుబడిన రూ.2.30కోట్ల విలువ చేసే డ్రగ్స్‌తో పాటు 848కిలోల గంజాయినిఆబ్కారీ అధికారులు దహనం(Drugs burnt) చేశారు. ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా ఆబ్కారీ యూనిట్, ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 43కేసుల్లో పట్టుబడిన 848కిలోల గంజాయి, 900గ్రాముల ఆల్ఫోజోలం, 600గ్రాముల క్లోరో హైడ్రేడ్, 700గ్రాముల హషీష్ ఆయిల్, 3ఎల్ఎస్డి బ్లాస్ట్‌లు, 50ఎండిఎంఎ పిల్స్ తదితర మత్తు పదార్థాలను యాదాద్రి భువనగిరి తొక్కాపూర్ గ్రామంలో ఉన్న హోమ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ బయోకెమికల్ కంపెనీలో దహనం చేశారు.
రంగారెడ్డి జిల్లా డీసీ దశరథ్ పర్యవేక్షణలో మల్కాగిజిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.నవీన్‌కుమార్, ఘట్కేసర్ సిఐ జె.రవి పట్టుబడిన మత్తు పదార్థాలను డిస్పోజల్ చేశారు. ఈ సందర్భంగా అధికారులను ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి అభినందించారు.
ఇవి కూడా చదవండి..
KTR | నువ్వు ఎప్పుడు జైలుకు పోతావో చూస్కో.. మంత్రి పొంగులేటికి కేటీఆర్ వార్నింగ్