హైదరాబాద్ : రాష్ట్రంలో శాంతిభద్రతలు అడ్డుఅదుపులేకుండా పోతున్నాయి. పట్టపగలే దోపడీ, దౌర్జన్యాలు కొనసాగుతుండటంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా మహిళా కానిస్టేబుల్ పై దుండగులు దాడికి పాల్పడటం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..బంజారాహిల్స్( Banjara Hills) రోడ్ నంబర్ 12లోని సయ్యద్ నగర్లో బైక్ పార్కింగ్ విషయంలో దూషిస్తూ కొంతమంది వ్యక్తులు మహిళా కానిస్టేబుల్‌పై(Woman constable) దాడికి పాల్పడ్డారు. అడ్డుకున్న ఆమె తమ్ముడి మీద కూడా దాడి చేశారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.