Tribanadhari Barbarik | మైథలాజికల్ కాన్సెప్ట్‌తో రామాయణ, మహాభారతాల పాత్రలను తీసుకుని ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఇదే జోనర్లో భీముడు మనవడు, ఘటోత్కచుడు కుమారుడు బార్బరిక్పై వస్తున్న చిత్రం త్రిబాణధారి బార్బరిక్ (Tribanadhari Barbarik). సత్యరాజ్ లీడ్ రోల్లో నటిస్తోన్న ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను షేర్ చేశారు మేకర్స్.
ఎవరు తాతా ఇతను..? అని చిన్నారి అడుగగా.. ప్రపంచం గుర్తించని గొప్ప యోధుడమ్మా.. భీష్ముడా తాతా..? హహ కాదమ్మా.. అంటూ సాగే సంభాషణలతో షురూ అయింది టైటిల్ గ్లింప్స్. మాధవా.. వెయ్యేనుగుల బలశాలి భీముడికి మనవడిని. ఘటోత్కచుడుకు కుమారుడిని అంటూ బార్బరిక్ ఇంట్రడక్షన్ వీడియో స్టన్నింగ్‌గా సాగుతోంది. గాండీవధారి అర్జున, పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం, గరుడ పురాణం అంటూ పలు గ్రంథాలు, వాటిపై వాచ్‌ను చూడొచ్చు. టైటిల్ గ్లింప్స్‌తోనే క్యూరియాసిటీ అమాంతం పెంచేస్తుంది మారుతి టీం.
స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్ రెడ్డి అడిధాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో వశిష్ఠ ఎన్ సింహా, సంచి రాయ్, సత్యం రాజేశ్, క్రాంతి కిరణ్, వీటీవీ గణేశ్, మొట్ట రాజేంద్ర, ఉదయ భాను ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
త్రిబాణధారి బార్బరిక్ టైటిల్ గ్లింప్స్..
Kanguva | ఇక హైదరాబాద్‌లో.. సూర్య కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్ టైం, వెన్యూ ఫిక్స్..!
Revolver Rita | రివాల్వర్ రీటా వచ్చేస్తుంది.. టాప్ బ్యానర్ల చేతిలో కీర్తి సురేశ్ సినిమా రైట్స్
Sai Pallavi | సాయి పల్లవి యాక్టింగ్ చూసి ఏడ్చేశా.. అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్
Thandel | నాగచైతన్య, సాయి పల్లవి ఎమోషనల్ స్టిల్.. థియేటర్లలో తండేల్ సునామి వచ్చే తేదీ ఇదే..!
Devara | దేవర వచ్చేస్తున్నాడు.. ఓటీటీ ప్లాట్‌ఫాంలో తారక్ మూవీ స్ట్రీమింగ్ టైం ఫిక్స్