Andrew McDonald : ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) సొంత మైదానంలో ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. కొత్త ఏడాదిలో పాకిస్థాన్(Pakistan)తో జరిగే టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌కు ఈ స్టార్ ఓపెనర్ వీడ్కోలు పలకనున్నాడు. ఈ నేపథ్యంలో డేవిడ్ భాయ్‌పై హెడ్‌కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్(Andrew McDonald) ప్రశంసలు కురిపించాడు. అన్ని ఫార్మాట్లలో ఆసీస్ త అత్యుత్తమ ఆటగాడు వార్నర్ అని కితాబిచ్చాడు.
‘ఆసీస్ తరఫున అన్ని ఫార్మాట్లలో గొప్ప ఆటగాడు వార్నర్. టెస్టులకు అతడు వీడ్కోలు పలుకడం కంగారూలకు పెద్ద లోటు. కొన్ని రోజులుగా అందరూ అతడిని టార్గెట్ చేస్తున్నారు. కానీ, వార్నర్ తన బ్యాటుతోనే విమర్శకులకు సమాధానం చెప్పాడు. తొలి టెస్టులో వీరోచిత సెంచరీతో కోచ్, కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు’ అని మెక్‌డొనాల్డ్ తెలిపాడు.
ఓపెనర్‌గా ఆస్ట్రేలియా క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన వార్నర్ 111 టెస్టుల్లో 8,695 పరుగులు సాధించాడు. రికార్డు స్థాయిఓల 26 సెంచరీలు బాదాడు. అంతేకాదు రికీ పాంటింగ్(Ricky Ponting) తర్వాత ఆసీస్ తరఫున అత్యధిక రన్స్ కొట్టిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. వార్నర్ వెస్టిండీస్ పర్యటనకు దూరం కానున్నాడు. అయితే.. యూఏఈలో వచ్చే ఏడాది జరిగే ఇంటర్నేషనల్ టీ20(ILT20) లీగ్‌లో ఈ డేంజరస్ ఓపెనర్ మెరుపులు మెరిపించనున్నాడు.