Sohail Tanvir: పాకిస్తాన్లో చీఫ్ సెలక్టర్.. అమెరికాలో క్రికెటర్..
Sohail Tanvir: పీసీబీ జూనియర్ చీఫ్ సెలక్టర్‌గా ఇటీవలే ఎంపికైన తన్వీర్ ప్రస్తుతం టెక్సాస్‌లో జరుగుతున్న అమెరికన్ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)లో ఆడుతున్నాడు. దీనిపై పాక్ మాజీ క్రికెటర్లు పీసీబీపై దుమ్మెత్తి పోస్తున్నారు.
Sohail Tanvir: గత కొంతకాలంగా వరుస వివాదాలతో సతమతమవుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లో మరో కొత్త వివాదం రాజుకుంది. పాకిస్తాన్ జాతీయ జూనియర్ టీమ్‌కు చీఫ్ సెలక్టర్‌గా ఉన్న ఆ జట్టు మాజీ క్రికెటర్ సోహైల్ తన్వీర్‌ను పీసీబీ.. అమెరికాలో జరుగుతున్న ఓ క్రికెట్ లీగ్‌లో ఆడించడం కొత్త వివాదానికి దారితీసింది. దీనిపై పాక్ మాజీ క్రికెటర్లు పీసీబీపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇది ద్వంద్వ ప్రయోజనాల కిందకే వస్తుందని వాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. పీసీబీ జూనియర్ చీఫ్ సెలక్టర్‌గా ఇటీవలే ఎంపికైన తన్వీర్ ప్రస్తుతం టెక్సాస్‌లో జరుగుతున్న అమెరికన్ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)లో ఆడుతున్నాడు. త్వరలో దక్షిణాఫ్రికా వేదికగా జరుగనున్న ఐసీసీ అండర్ – 19 వన్డే వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ అండర్ – 19 జట్టును ప్రకటించిన కొద్దిరోజులకే తన్వీర్.. అమెరికా వెళ్లి ఏపీఎల్ ఆడుతున్నాడు.
ఏపీఎల్‌లో తన్వీర్.. ‘ప్రీమియమ్ పాక్స్’ తరఫున ఆడుతుండగా టెక్సాస్‌లోని మూసా స్టేడియంలో ‘ప్రీమియమ్ కెనడీయన్స్’తో ఇటీవలే ముగిసిన మ్యాచ్‌లో తన్వీర్ బౌలింగ్‌లో రెండు వికెట్లు తీయడమే గాక బ్యాటింగ్‌లో 31 రన్స్ కూడా చేశాడు. ఇదిలాఉండగా పీసీబీలో సీనియర్, జూనియర్ చీఫ్ సెలక్టర్ల పదవులకు ఎంపికైన వారికి భారీగా వేతనాలు దక్కుతున్నాయి. అయినా తన్వీర్ మాత్రం ఏపీఎల్ ఆడేందుకు పీసీబీ అంగీకారం తెలపడం విమర్శలకు తావిచ్చింది. కొద్దిరోజుల క్రితమే వన్డే వరల్డ్ కప్‌లో పాక్ వైఫల్యం అనంతరం మాజీ చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్.. విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నాడనే ఆరోపణతో ఆయనను బలవంతంగా రాజీనామా చేయించినట్టు పాక్ మీడియా కోడై కూసింది. అదే సూత్రం తన్వీర్‌కు వర్తించదా..? అని మాజీలు పీసీబీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Chief Selector Sohail Tanvir Man of match in American 🇺🇸 Premier League #Cricket pic.twitter.com/sbxjtiwOoU
— Muhammad Noman (@Nomancricket29) December 31, 2023
కాగా తన్వీర్ ఏపీఎల్‌లో ఆడుతుండగా పీసీబీ సీనియర్ జట్టుకు చీఫ్ సెలక్టర్‌గా ఉన్న వహబ్ రియాజ్ కూడా వచ్చే ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో ఆడేందుకు రెడీ అవుతుండటం కొత్త చర్చకు దారి తీస్తోంది. తన్వీర్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో రియాజ్.. పీఎస్ఎల్ ఆడతాడా..? లేదా..? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు డైరెక్టర్‌గా ఉన్న మహ్మద్ హఫీజ్ కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్నాక కొద్దిరోజుల పాటు వివిధ దేశాలలోని క్రికెట్ లీగ్‌లలో పాల్గొన్నాడు. కానీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పదవి దక్కాక అతడు ఫ్రాంచైజీ క్రికెట్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ప్రస్తుతం తనకు తన బాధ్యతల గురించి తప్ప లీగ్ క్రికెట్ మీద ఆసక్తి లేదని అతడు ఇటీవలే స్పష్టం చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
Dasara Posters | టాలీవుడ్లో పండగ జోష్.. దసరా కానుకగా సందడి చేసిన కొత్త సినిమాల పోస్టర్లు చూశారా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

