T20 World Cup 2024 : మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ (Australia Cricket) స్క్వాడ్‌ను ప్రకటించింది. అలిసా హేలీ(Alyssa Healy) కెప్టెన్‌గా 15 మందితో కూడిన బృందాన్ని సోమవారం సీఏ వెల్లడించింది. ఆల్‌రౌండర్ తహ్లియా మెక్‌గ్రాత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. డిఫెండింగ్ చాంపియన్‌గా ఆసీస్ ఈ మెగా టోర్నీలో ఆడనున్న నేపథ్యంలో ఆల్రౌండర్లకు పెద్ద పీట వేశారు. ఏకంగా ఆరుగురు మ్యాచ్ విన్నర్లను తుది బృందంలోకి తీసుకున్నారు.
ఈసారి మహిళల టీ20 ప్రపంచ కప్ స్క్వాడ్‌లో ముగ్గురు కొత్త అమ్మాయిలకు ఆస్ట్రేలియా సెలెక్టర్లు అవకాశమిచ్చారు. హీథర్ గ్రాహమ్, ఆల్‌రౌండర్ జెస్ జొనాసెన్, మాజీ సారథి మేగ్ లానింగ్ స్థానంలో యువకెరటాలు తహ్లా వ్లేమింక్, సోఫీ మొలినెక్స్, ఫొబె లిచ్‌ఫీల్డ్‌లు స్క్వాడ్‌లోకి వచ్చారు.
Introducing our 2024 Women’s @T20WorldCup squad 🇦🇺
Our @AusWomenCricket will take on New Zealand in a three-match T20I series in Mackay and Brisbane before travelling to the UAE to defend their World Cup crown 👊 pic.twitter.com/qJQVRXASA5
— Cricket Australia (@CricketAus) August 26, 2024
ఆస్ట్రేలియా స్క్వాడ్ : అలీసా హేలీ(కెప్టెన్), బేత్ మూనీ, తహ్లియా మెక్‌గ్రాత్(వైస్ కెప్టెన్), ఎలీసా పెర్రీ, అష్ గార్డ్నర్, కిమ్ గార్త్, గ్రేస్ హ్యారిస్, అన్నాబెల్ సథర్లాండ్, తహ్లా వ్లేమింక్, మేగన్ షట్, అలనా కింగ్, సోఫీ మొలినెక్స్, డార్సీ బ్రౌన్, జార్జియా వరేహమ్.
మహిళల టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. అందరూ అనుకున్నట్టే ప్రపంచ కప్ వేదిక మారింది. బంగ్లాదేశ్(Bangladesh)లో అందోళనకర పరిస్థితుల దృష్ట్యా మెగా టోర్నీని యూఏఈ(UAE)లో జరిపేందుకు ఐసీసీ(ICC) సిద్ధమైంది. ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు యూఏఈలో వరల్డ్ కప్ పోటీలు నిర్వహిస్తామని వెల్లడించింది.