Himanta Biswa Sarma : జార్ఖండ్ ముఖ్యమంత్రి (Jarkhand CM), జేఎంఎం పార్టీ చీఫ్ (JMM Chief) హేమంత్ సోరెన్ (Hemanth Soren), జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి (Jarkhand former CM), జేఎంఎం పార్టీ సీనియర్ నేత (JMM senior leader) చంపాయ్ సోరెన్ (Champai Soren) బీజేపీలో చేరాలని అసోం ముఖ్యమంత్రి (Assam CM), జార్ఖండ్ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి హిమాంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) అన్నారు.
జార్ఖండ్ రాష్ట్ర ప్రధాన సమస్య చొరబాటుదారులేనని, ఆ సమస్యపై సీఎం హేమంత్ సోరెన్‌తో మాట్లాడేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నదని బిశ్వశర్మ చెప్పారు. ‘చంపాయ్ సోరెన్ బీజేపీలో చేరాలని నేను కోరుతున్నా. ఆయన చేరితే మా పార్టీ బలోపేతం అవుతుంది. ఆయన చాలా పెద్ద నాయకుడు. ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం కరెక్టు కాదు. హేమంత్ సోరెన్ కూడా బీజేపీలో చేరాలని నేను కోరుకుంటున్నా’ అని ఆయన వ్యాఖ్యానించారు.
‘బీజేపీ అంటే దేశభక్తి. జార్ఖండ్‌లోకి చొరబాటుదారులు రాకుండా నిలువరించే అంశంపై హేమంత్ సోరెన్‌తో చర్చించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నాం. మనం జార్ఖండ్‌ను చొరబాటుదారుల నుంచి కాపాడుకోవాలి. మనకు మన దేశమే ముఖ్యం. మేం రెండే రెండు డిమాండ్లు చేస్తున్నాం. హేమంత్ సోరెన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, జార్ఖండ్‌ను చొరబాటుదారుల నుంచి విముక్తం చేయాలి’ అని హిమాంత బిశ్వశర్మ అన్నారు.