KTR | ‘కాంగ్రెస్ వస్తే రైతు బంధు బందయితని కేసీఆర్ అంటున్నరు.. మేమేమన్నా దివానాగాళ్లమా.. మాకు ధిమాక్ లేదా ’ అని ఒకడు మాట్లాడిండు. మరి ఇయ్యాళ్ల నేను అడుగుతున్నా నువ్వొచ్చి రెండున్నరేళ్లు ఆయే.. నాలుగుసార్లు రైతు బంధు ఎగ్గొట్టినవ్.. మరి ఏమనాలే నిన్ను దివానాగాడు అంటే తప్పయిదా.. ధిమాక్ లేనండంటే తప్పయితదా..? నేను తిట్టిన తిట్ల కంటే ఎక్కువ గ్రామాల్లో తిడుతున్నరు. ఎక్కడనన్నా దొరికితే తన్నేటట్టే ఉన్నరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ముషీరాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ మెంబర్ షిప్ డ్రైవ్లో కేటీఆర్ మాట్లాడుతూ.. వడ్లు కొంటలేరు.. యూరియా ఇస్తలేరు. రైతులు కష్టపడి పంట పండించుకుందామంటే రైతు బంధు వేస్తలేడు. కరెంట్ సక్కగ ఇస్తలేడు. ఎంత చెప్పలేని గోస పెడుతున్నడంటే అంత పెడుతున్నడు. చెప్పలేని గోస గ్రామాల్లో ఉన్నది. హైదరాబాద్లో మీరిట్లే భద్రంగా ఉండండి. మళ్లా మీరెట్లాగో గులాబీ కండువాను గెలిపిస్తరనే నమ్మకముంది. ఈ సారి తిరుగుబాటు గ్రామాల నుంచి మొదలవుతదన్నారు..
ఏ గ్రామాలైతే గెలిపించినయో.. ఏ జిల్లాలైతే గతంలో పొరపాటలను కాంగ్రెస్ పార్టీకి ఓటేసిర్రో… వాళ్లంతా ఇయ్యాళ్ల తిరుగుబాటు మూడ్లో ఉన్నరని కేటీఆర్ స్పష్టంచేశారు. ఎన్నికలు ఎప్పుడొస్తయా.. కాంగ్రెస్ పార్టీని ఎప్పుడెప్పుడు తరిమి కొడదామా..?అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
ఇంకో సంవత్సరంపాటు ఎక్కడోళ్లం అక్కడ కష్టపడితే.. కరెక్టు చూసుకుంటే.. మనం చేసేది చాలా ఉన్నది. మనల్ని ఇయ్యాళ్ల సతాయించేటోడు.. నకరాల్ చేసేటోడు.. కాంగ్రెసోడు.. వాళ్లను చూసుకొని ఎగిరే బీజీపీవాళ్లు చాలా మంది ఎక్స్ట్రా ఆర్టిస్టులన్నారు. వాళ్లందరికీ మిత్తితో సహా చెల్లించే బాధ్త నాదని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇంకో సంవత్సరం కష్టపడితే మనల్ని సతాయించే కాంగ్రెస్, బీజేపీ వాళ్ళకి మిత్తితో సహా చెల్లించే బాధ్యత నాది
– కేటీఆర్ pic.twitter.com/lbNdO6qr09
— Telugu Scribe (@TeluguScribe) May 30, 2026
రైతు ద్రోహి రేవంత్ సర్కార్ పై
గ్రామాల నుంచే తిరుగుబాటు మొదలైంది 🔥కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నరు.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/HyBXVUdELm
— BRS Party (@BRSparty) May 30, 2026
This Weekend OTT | ‘జెట్ లీ’, ‘కర’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన వెబ్ సిరీస్లు, సినిమాలివే!
Rajamouli | ‘వారణాసి’కి మళ్లీ లీకుల బెడద.. జక్కన్న మౌనం వెనుక అసలు వ్యూహం ఏంటి?
Transgender Influencer: మున్నిపల్ ఎన్నికల్లో గెలిచిన ట్రాన్స్జెండర్ ఇన్ఫ్లూయెన్సర్