ఢాకా: క్రికెటర్ షకీబ్ అల్ హసన్(Shakib Al Hasan)పై బ్యాన్ విధించాలని కోరుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు లీగల్ నోటీసులు అందాయి. ప్రస్తుతం పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఆల్‌రౌండర్ షకీబ్ ఆడుతున్నాడు. రెండు రోజుల క్రితమే బంగ్లాదేశ్ జట్టు చరిత్రాత్మక రీతిలో పాక్‌పై టెస్టు విక్టరీని కొట్టింది. అయితే ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్ల సమయంలో.. రూబల్ అనే వ్యక్తి మరణించారు. ఆ ఘటన నేపథ్యంలో షకీబ్ అల్ హసన్‌పై హత్య కేసు నమోదు అయ్యింది. ఆ కేసును దాఖలు చేసిన రఫీకుల్ ఇస్లాం అనే వ్యక్తి తమ లాయర్ల చేత.. బంగ్లా క్రికెట్ బోర్డుకు లీగల్ నోటీసులు పంపారు. అన్ని ఫార్మాట్ల నుంచి షకీబ్‌ను బ్యాన్ చేయాలని ఆ నోటీసులో లాయర్లు డిమాండ్ చేశారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు బీసీబీ అధ్యక్షుడు ఫారూక్ అహ్మద్ తెలిపారు.