అమరావతి : కార్మికుల కుటుంబాలను అడ్డం పెట్టుకుని రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత (AP Minister Anitha ) ఆరోపించారు. విజయవాడలో ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలోని పారిశ్రామిక వాడలో జరిగిన ప్రమాదాలపై వైసీపీ (YCP) అనవసర రాజకీయం చేస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఏ ప్రమాదం జరిగిన ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన స్పందిస్తుందని వెల్లడించారు. అయితే వైసీపీ పాలన కంటే మెరుగైన పాలన కూటమి ప్రభుత్వం అందిస్తుందని స్పష్టం చేశారు. అనకాపల్లి పరవాడ (Parawada) లో సినర్జన్ బాధితులకు సైతం రూ. కోటి పరిహారం అందజేస్తామని అన్నారు. ఘటనలో మొత్తం నలుగురిలో ముగ్గురు చనిపోవడం దురదృష్టకరమని , బాధితులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు , రాష్ట్ర మంత్రులు బాధితులను పరామర్శించి వారికి భరోసా కల్పించామని తెలిపారు.