అమరావతి : అనకాపల్లి జిల్లా పరవాడలో (Paravada incident) ఈనెల 22న జరిగిన కెమికల్ లీకేజీ ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది. అనకాపల్లి జిల్లా (Anakapalli) పరవాడ సినర్జిన్ యాక్టివ్ ఇన్గ్రేడింట్స్ యూనిట్-3లో ప్రమాదం జరుగగా మొత్తం నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇప్పటి వరకు చికిత్సపొందుతూ ముగ్గురు మృతి చెందారు.
విజయనగరం జిల్లాకు చెందిన కెమిస్ట్ (Chemist ) సూర్యనారాయణ సోమవారం తెల్లవారుజామున విశాఖలోని ఇండస్ ఆస్పత్రి (Indus Hospital) లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతదేహాన్ని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు . 23న లాల్‌సింగ్ పూరి, 24న ఝార్ఖండ్ వాసి రోయ అంగిరియా మృతి చెందాడు. ఓయబోం కొర్హ అనే మరో కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అంతకు ఒకరోజు ముందు అనకాపల్లి(Anakapalli) జిల్లా సెజ్‌లోని ఎస్సెన్సీయా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన(Reactor Blast) ఘటనలో 17 మంది చనిపోగా మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై స్పందించిన ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ. 50 లక్షల చొప్పున స్వల్పంగా గాయపడ్డ వారికి రూ. 25 లక్షల చొప్పున పరిహారాన్ని అందించారు.