Australia : సొంతగడ్డపై వెస్టిండీస్‌తో సిరీస్ పంచుకున్న ఆస్ట్రేలియా(Australia) మరో సుదీర్ఘ సమరానికి సిద్ధమవుతోంది. న్యూజిలాండ్ పర్యటన (Newzealand Tour)లో కమిన్స్ సేన రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు మరో 20 రోజులే ఉండడంతో శుక్రవారం క్రికెట్ ఆస్ట్రేలియా 14 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించింది. ఆల్‌రౌండర్ మేఖేల్ నేసర్(Michael Neser) మళ్లీ జట్టులో చోటు దక్కించుకోగా.. రెన్షా రిజర్వ్ ఓపెనర్‌గా ఎంపికయ్యాడు.
ఇరుజట్ల మధ్య వెల్లింగ్టన్లో ఫిబ్రవరి 29న తొలి టెస్టు షూరూ కానుంది. అనంతరం మార్చి 8న క్రిస్ట్‌చర్చ్‌లోని హగ్లే ఓవల్‌లో రెండో టెస్టు జరుగనుంది. ప్రస్తుతం కివీస్, ఆసీస్‌లు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
A very familiar squad set to cross the ditch.
Our men’s red-ball stars will be back in action soon, with Tests against the @BLACKCAPS in Wellington and Christchurch beginning on Feb 29! #NZvAUS pic.twitter.com/OLqcHToXcf
— Cricket Australia (@CricketAus) February 8, 2024
ఆస్ట్రేలియా టెస్టు స్క్వాడ్ : ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మాథ్యూ రెన్షా, స్టీవ్ స్మిత్(వైస్ కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, మైఖేల్ నేసర్, మిచెల్ స్టార్క్.
న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు వరుస విజయాలతో డబ్ల్యూటీసీ పట్టికలో టాప్‌లో నిలిచాయి. సొంతగడ్డపై పాకిస్థాన్‌ను వైట్‌వాష్ చేసిన కమిన్స్ సేన.. గబ్బా టెస్టులో అనూహ్యంగా వెస్టిండీస్ చేతిలో ఓటమి పాలైంది. షమర్ జోసెఫ్ 7 వికెట్లతో చెలరేగగా పింక్ బాల్ టెస్టులో అనూహ్యంగా కంగుతిన్నది. మరోవైపు కివీస్ .. బంగ్లాదేశ్‌తో సిరీస్ సమం చేసుకోవడమే కాకుండా తొలి టెస్టులో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించింది.