SA20 | చితక్కొట్టిన క్లాసెన్, మల్డర్.. ఫైనల్లో డర్బన్ సూపర్ జెయింట్స్
SA20 : దక్షిణాఫ్రికా టీ20 లీగ్ రెండో సీజన్లో డర్బన్ సూపర్ జెయింట్స్(Durban Super Giants) ఫైనల్‌కు దూసుకెళ్లింది. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్(Sunrisers Eastern Cape)తో టైటిల్ పోరుకు సిద్ధమైంది. గురువారం జరిగిన క్వాలిఫయర్ 2లో...
SA20 : దక్షిణాఫ్రికా టీ20 లీగ్ రెండో సీజన్లో డర్బన్ సూపర్ జెయింట్స్(Durban Super Giants) ఫైనల్‌కు దూసుకెళ్లింది. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్(Sunrisers Eastern Cape)తో టైటిల్ పోరుకు సిద్ధమైంది. గురువారం జరిగిన క్వాలిఫయర్ 2లో జొబర్గ్ సూపర్ కింగ్స్‌పై డర్బన్ జట్టు 69 పరుగుల తేడాతో గెలుపొందింది. హెన్రిచ్ క్లాసెన్(74 ) సిక్సర్లతో విరుచుకుపడగా.. వియాన్ మల్డర్(50) హాఫ్ సెంచరీతో అండగా నిలిచాడు.
ఆ తర్వాత యువ పేసర్ జూనియర డాలా సంచలన ఇన్నింగ్స్‌తో డర్బన్ను ఫైనల్‌కు చేర్చిన క్లాసెన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఫిబ్రవరి 10వ తేదీన జరిగే టైటిల్ పోరులో సన్‌రైజర్స్, డర్బన్ జట్లు అమీతుమీ తేల్చుకున్నాయి.
𝙋𝙖𝙧𝙩𝙣𝙚𝙧𝙨𝙝𝙞𝙥 𝙤𝙛 𝙩𝙝𝙚 𝙞𝙣𝙣𝙞𝙣𝙜𝙨 #Playoffs #DSGvJSK#Betway #SA20 #WelcomeToIncredible pic.twitter.com/igxilfcJmV
— Betway SA20 (@SA20_League) February 8, 2024
క్వాలిఫయర్ 1లో మర్క్రమ్ సేన చేతిలో కంగుతిన్న డర్బన్ జట్టు కీలమైన క్వాలిఫయర్2లో చెలరేగిపోయింది. జోబర్గ్ బౌలర్లను ఉతికారేసిన క్లాసెన్ 30 బంతుల్లో మూడు ఫోర్లు, ఏడు సిక్సర్లతో 74 పరుగులు బాదాడు.
𝙈𝙞𝙡𝙚𝙨𝙩𝙤𝙣𝙚 𝙢𝙪𝙘𝙝? #Playoffs #DSGvJSK
Klaasen and Mulder highlights in the thread. #Betway #SA20 #WelcomeToIncredible pic.twitter.com/z8rpIyIgm5— Betway SA20 (@SA20_League) February 8, 2024
మరో ఎండ్‌లో మల్డర్ మెరుపు హాఫ్ సెంచరీ కొట్టడంతో డర్బన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 రన్స్ కొట్టింది. డర్బన్ బౌలర్లను ఊచకోత కోస్తూ.. వీళ్లిద్దరూ 19 బంతుల్లోనే 61 పరుగులు పిండుకున్నారు. అనంతరం జొబర్గ్.. 142 పరుగులకే ఆలౌటయ్యింది. జూనియర్ డాలా 4 వికెట్లతో డర్బన్‌కు కోలుకోలేని దెబ్బ తీశాడు.
#Betway #SA20 #Playoffs #DSGvJSK Junior Dala🔥 pic.twitter.com/0s6JruNr4I
— Betway SA20 (@SA20_League) February 8, 2024
భారీ ఛేదనలో కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(3), డూ ప్లూయ్(10)లు 13 పరుగుల లోపే పెవిలియన్ చేరగా.. రీజా హెండ్రిక్స్(27), సిబొనెలో మఖాన్య(11) వేగంగా ఆడేందుకు ప్రయత్నించి వెనుదిరగారు. మోయిన్ అలీ 30, డౌగ్ బ్రాస్‌వెల్ 23 పరుగులతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు.
ఇవి కూడా చదవండి
- Mohammad Shami | ‘సొంత రక్తాన్ని ఎవరైనా వదులుకుంటారా’.. కూతురుని మిస్ అవ్వడంపై షమీ
- Edupayala | భక్తులతో కిటకిటలాడిన ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Basar IIIT | బాసర ట్రిపుల్ ఐటీకి నీటి కరువు.. నీటి సమస్యతో తరగతులు బంద్
Cyclone Arnab | ‘అర్ణబ్’తో కోస్తాంధ్రకు వణుకు వాతావరణ శాఖ హైఅలర్ట్
Land Scam | అసైన్డ్ ఖల్లాస్.. 1000 కోట్ల విలువైన లావణి భూముల్లో బిగ్ విల్లాస్!.. మంఖాల్‌లో భూ కైంకర్యం
Horoscope | 26-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
ఆ ఆలస్యం నాకిష్టంలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

