2024 Loksabha Elections | యూపీలో విపక్ష ఇండియా కూటమికి షాక్ : బీజేపీతో ఆర్ఎల్డీ పొత్తు ఖరారు
2024 Loksabha Elections : విపక్ష ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీతో ఆర్ఎల్డీ పొత్తు ఖరారైంది.
2024 Loksabha Elections : విపక్ష ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీతో ఆర్ఎల్డీ పొత్తు ఖరారైంది. సీట్ల సర్దుబాటు ఒప్పందం ప్రకారం ఆర్ఎల్డీ యూపీలో రెండు లోక్‌సభ స్ధానాల్లో పోటీ చేస్తుంది. బాఘ్పట్, బిజ్నూర్ స్ధానాల్లో ఆర్ఎల్డీ పోటీ చేయనుండగా మరో రాజ్యసభ సీటు కేటాయిస్తామని కూడా జయంత్ చౌధురి పార్టీకి బీజేపీ హామీ ఇచ్చింది.
మరో రెండు మూడు రోజుల్లో ఆర్ఎల్డీ, బీజేపీ పొత్తుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. యూపీలో ఆర్ఎల్డీకి పశ్చిమ యూపీలో గట్టి పట్టుంది. ఈ ప్రాంతంలో ప్రాబల్యం కలిగిన జాట్ ఓటుబ్యాంక్‌పై కన్నేసిన బీజేపీ ఆర్ఎల్డీతో పొత్తుకు మొగ్గుచూపింది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో 16 స్ధానాలను బీజేపీ కోల్పోగా ఇందులో 7 స్ధానాలు పశ్చిమ యూపీలోనివే కావడం గమనార్హం. మొరదాబాద్ డివిజన్లో 6 స్ధానాల్లోనూ కాషాయ పార్టీ పరాజయం పాలైంది. యూపీలో ఇండియా విపక్ష కూటమిలో సీట్ల సర్ధుబాటులో విభేదాలు తలెత్తడంతో ఆర్ఎల్డీ ఎన్డీయేకు చేరువైంది.
Read More :
Kishan Reddy | అధికారంలోకి వచ్చిన 2 నెలలకే కాంగ్రెస్ వసూళ్ల పర్వం : కిషన్ రెడ్డి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

