గంట వ్యవధిలో తండ్రీ కొడుకు మృతి
గంట వ్యవధిలో తండ్రీ కొడుకు అనారోగ్యంతో మృతిచెందారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన ఎరుకల రాజేశం (56) పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. ఇంటి వద్ద చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం 1.45 గంటలకు మృతిచెందాడు.
రామగిరి, జనవరి 1: గంట వ్యవధిలో తండ్రీ కొడుకు అనారోగ్యంతో మృతిచెందారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన ఎరుకల రాజేశం (56) పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. ఇంటి వద్ద చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం 1.45 గంటలకు మృతిచెందాడు. అప్పటికే రాజేశం రెండో కొడుకు శ్రీకాంత్ (37) బుధవారం రాత్రి ఛాతిలో తీవ్రమైన నొప్పితో అస్వస్థతకు గురికాగా, హుటాహుటిన గోదావరిఖనిలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. తండ్రి మరణించిన గంట వ్యవధిలోనే 2.30 గంటల సమయంలో శ్రీకాంత్ దవాఖానలో మృతి చెందాడు.
బస్సు కింద పడి భార్యాభర్తల దుర్మరణం
మలక్‌పేట, జనవరి 1: కూతురు ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ట్యాంక్‌బండ్ సందర్శనకు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం చెందిన విషాద ఘటన గురువారం వాహెద్‌నగర్‌లో చోటుచేసుకుంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లాకు చెందిన తిరుపతిరావు, వెంకటమ్మ దంపతులు కొత్తపేటలో నివాసముంటున్న కూతురుని చూసేందుకని వచ్చారు. వీరు వాహనంపై ట్యాంక్‌బండ్ సందర్శనకు బయల్దేరగా, వాహెద్‌నగర్ హైటెక్ గార్డెన్స్ సమీపంలో ఆర్టీసీ బస్సు వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో భార్యా భర్తలిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

