Bigg Boss 10 | ముకేష్, వర్షిణిపై మాటల యుద్ధం.. దేబ్జానీ ఎమోషనల్.. శివ, త్రిగుణ్ ఫైర్!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో తొమ్మిదో వారం నామినేషన్ల ప్రక్రియ హౌస్‌లో మరోసారి వేడిని పెంచింది. డే 58 ఎపిసోడ్లో ముకేష్ గౌడ్, వర్షిణి ప్రధానంగా టార్గెట్ అయ్యారు.
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో తొమ్మిదో వారం నామినేషన్ల ప్రక్రియ హౌస్‌లో మరోసారి వేడిని పెంచింది. డే 58 ఎపిసోడ్లో ముకేష్ గౌడ్, వర్షిణి ప్రధానంగా టార్గెట్ అయ్యారు. నామినేషన్ల సందర్భంగా పాత గొడవలు మళ్లీ తెరపైకి రావడంతో ఇంటి సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. వర్షిణితో శివ్, నరేష్, రామ్ ప్రసాద్ వాదనకు దిగగా.. ముకేష్ వ్యాఖ్యలపై దేబ్జానీ తీవ్రంగా స్పందించింది. శివ, త్రిగుణ్ సైతం ముకేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తొమ్మిదో వారం నామినేషన్లలో వర్షిణి.. నరేష్‌ను టార్గెట్ చేసింది. హోటల్ టాస్క్ సమయంలో ఝాన్సీ డబ్బులు అడిగినా నరేష్ ఇవ్వలేదని ప్రశ్నించింది. దేబ్జానీ చెప్పిన కారణంగానే అతడు డబ్బులు ఇవ్వలేదని ఆరోపించింది. దీనికి నరేష్ గట్టిగా బదులిచ్చాడు. డబ్బులు తనవని, వాటిని ఇచ్చిన తర్వాత ఎలా ఖర్చు చేసుకోవాలనేది తన ఇష్టమని గతంలోనే చెప్పానని గుర్తుచేశాడు. అదే విషయాన్ని పదేపదే ప్రస్తావించాల్సిన అవసరం లేదని అసహనం వ్యక్తం చేశాడు. ఇతరుల కోసం ఆడుతున్నావంటూ తనను ప్రశ్నిస్తున్న వర్షిణి కూడా అదే విధంగా వ్యవహరిస్తోందని కౌంటర్ ఇచ్చాడు.
ఆ తర్వాత రామ్ ప్రసాద్ వర్షిణిని నామినేట్ చేశాడు. బయటకు స్నేహంగా ఉంటూ లోపల మరోలా వ్యవహరిస్తోందని, తన అవసరాల కోసం నరేష్‌ను ఉపయోగించుకుందని ఆరోపించాడు. దీనికి వర్షిణి స్పందిస్తూ.. నరేష్ గ్రీన్ జోన్లోకి వెళ్లాడని, తాను మాత్రం వెళ్లలేదని చెప్పింది. అయితే తామిద్దరం పరస్పరం సహాయం చేసుకున్నామని, అందులో ఒకరిని మరొకరు ఉపయోగించుకోవడం ఏముందని రామ్ ప్రసాద్ ప్రశ్నించాడు. ఇక వర్షిణి శివ్‌ను నామినేట్ చేస్తూ.. ఇంట్లోకి వచ్చిన తర్వాత తమ మధ్య ఉన్న కూటమిని విడదీస్తానని చెప్పి ఆ ప్రయత్నంలో విజయం సాధించారని ఆరోపించింది. చివరకు ఝాన్సీ కూడా ఇంటి నుంచి వెళ్లిపోయిందని ప్రస్తావించింది. దీనికి శివ ఘాటుగా స్పందించాడు. ఝాన్సీ ఎలిమినేషన్‌కు ముకేష్ ప్రవర్తనే కారణమని, తాము ఎవరినీ మానసికంగా కుంగదీయలేదని చెప్పాడు. అలాంటి పరిస్థితులు తెచ్చుకున్నది మీరేనంటూ వర్షిణికి బదులిచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.
ముకేష్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఈ నామినేషన్లలో మరోసారి చర్చకు వచ్చాయి. దేబ్జానీ వెనుక శివ తిరుగుతున్నాడనే అర్థం వచ్చేలా ముకేష్ మాట్లాడటంపై శివ తీవ్రంగా స్పందించాడు. ఒక మహిళ గురించి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించాడు. గేమ్‌లో మూడు స్టార్ల కోసం ఇంతలా దిగజారాలా అంటూ నిలదీశాడు. దేబ్జానీ కూడా ముకేష్ ప్రవర్తనను తప్పుబట్టింది. టాస్కుల్లో వేగం, బ్యాలెన్స్ కంటే వ్యక్తిత్వం, ప్రవర్తనే ముఖ్యమని చెప్పింది. ముకేష్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ నామినేట్ చేసింది. అతడి మాటలతో తాను బాధపడ్డానని చెబుతూ చివరకు ‘ఐ పిటీ ఆన్ యూ ముకేష్’ అంటూ భావోద్వేగానికి గురైంది.
ముకేష్‌పై త్రిగుణ్ కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. అతడి ఆలోచనా విధానాన్ని తప్పుబడుతూ ‘డర్టీ మైండ్’, ‘వల్గర్ మైండ్’ అంటూ విమర్శించాడు. స్నేహానికి విలువ ఇవ్వడం, వ్యక్తిత్వం, నైతిక విలువలు ముకేష్లో లేవంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దీనికి ముకేష్ కూడా వెనక్కి తగ్గకుండా త్రిగుణ్‌పై ఎదురుదాడి చేశాడు. ఈ సమాజానికి నువ్వే హానికరమంటూ వ్యాఖ్యానించాడు. మరోవైపు శివ కూడా కోపంతో ముకేష్‌ను ఉద్దేశించి తీవ్ర పదజాలం ఉపయోగించాడు.
ఇప్పటివరకు రోహిత్‌ను లక్ష్యంగా చేసుకున్న త్రిగుణ్ బృందం, అతడు హౌస్ నుంచి వెళ్లిపోయిన తర్వాత ముకేష్, వర్షిణిలతో వివాదాలకు దిగుతోందనే చర్చకు ఈ ఎపిసోడ్లో చోటు దక్కింది. అయితే నామినేషన్ల సమయంలో శివ, త్రిగుణ్ ఉపయోగించిన ఘాటైన పదజాలంపై కూడా విమర్శలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. గేమ్‌లో అభిప్రాయ భేదాలు సహజమే అయినా, వ్యక్తిగత విమర్శలు, అవమానకరమైన మాటలు వివాదాలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | ముకేష్, వర్షిణిపై మాటల యుద్ధం.. దేబ్జానీ ఎమోషనల్.. శివ, త్రిగుణ్ ఫైర్!
Kollapur | ఫంక్షన్ హాల్లో బర్త్ డే సెలబ్రేషన్ వద్దు.. అమ్మ సమాధి దగ్గరే కేక్ కట్ చేస్తా.. ఆరేళ్ల బాలుడి నిర్ణయానికి కన్నీళ్లు!
High Court | లోతుకుంట భూములపై స్టేటస్కో తొలగింపు
Gold Smuggling | పసిడికి సుంకాల సెగ.. దేశంలో భారీగా పెరిగిన బంగారం స్మగ్లింగ్!
IND vs NZ ODI | టాస్ గెలిచిన భారత్.. కివీస్‌కు బ్యాటింగ్.. టీమిండియా తుది జట్టు ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

