AUS vs WI | టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. వెస్టిండీస్ నిర్దేశించిన 158 పరుగుల టార్గెట్‌ను ఇంకా 22 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. 158 పరుగుల టార్గెట్‌తో చేజింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆరంభం నుంచి దూకుడుగానే ఆడింది. మూడో ఓవర్లో పింఛ్ (9) వికెట్ కోల్పోయినప్పటికీ డేవిడ్ వార్నర్ (89*), మిచెల్ మార్ష్ (53) చెలరేగారు. ఇద్దరి భాగస్వామ్యంలో టార్గెట్‌ను సునాయసంగా చేరుకున్నారు. అయితే చివర్లో 157 పరుగుల వద్ద మిచెల్ ఔటయ్యాడు. కానీ వార్నర్ ఫోర్ బాది మ్యాచ్‌ను ముగించేశాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ బ్యాటర్లు ఆరంభంలో అదరగొట్టారు. కేవలం రెండు ఓవర్లలోనే 24 పరుగులు చేశారు. ఇక మూడో ఓవర్లో రెండో బంతికి క్రిస్ గేల్ ( 15)ను కమిన్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అప్పటి నుంచి పరుగులు చేయడంలో వెస్టిండీస్ ప్లేయర్లు పూరన్ ( 4), రోస్టన్ ( 0), ఎవిన్ లూయిస్ ( 29), హిట్మెయిర్ (27) తడబడ్డారు. ఫలితంగా 100 పరుగుల లోపే 5 వికెట్లను కోల్పోయింది. దీంతో పొలార్డ్ (44) తో కలిసి బ్రావో (12) వెస్టిండీస్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఇద్దరూ స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్‌కు చేరారు. ఆఖరల్లో రస్సెల్ ( 18) రెండు బంతులను సిక్సర్లు బాదడంతో వెస్టిండీస్ ఓ మోస్తరు స్కోర్ అయినా చేయగలిగింది.