IPL 2025 : మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్(Mumbai Indians) బోణీ కొట్టింది. ఐపీఎల్ 18వ సీజన్లో రెండు వరుస ఓటములకు గుడ్ బై చెబుతూ తొలి విజయం సాధించింది. సొంత మైదానమైన వాంఖడేలో గర్జించిన ముంబై కోల్‌కతా నైట్ రైడ ర్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత అశ్వనీ కుమార్(4-24) సంచనల బౌలింగ్‌తో కోల్‌కతాను దెబ్బకొట్టగా.. స్వల్ప ఛేదనలో ముంబై ఇండియన్స్ ఆడుతూ పాడుతూ పూర్తి చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ(13) విఫలమైనా రియాన్ రికెల్టన్(62 : 41 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్థ శతకంతో విజృంభించాడు. విల్ జాక్స్ ఔటయ్యాక.. రికెల్టన్ జతగా సూర్యకుమార్ యాదవ్(27నాటౌట్) లాంఛనం ముగించాడు. దాంతో.. పాండ్యా సేన విక్టరీతో రెండు పాయింట్లు సాధించింది.
ఐపీఎల్ 18 సీజన్లో ముంబై ఇండియన్స్ విజయగర్జన చేసింది. వాంఖడేలో ఆల్‌రౌండ్ షోతో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెక్ పెట్టింది. 117 పరుగుల ఛేదనలో ఓపెనర్ రియాన్ రికెల్టన్(62 నాటౌట్) ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడడంతో మరో 7 ఓవర్లు ఉండగానే జయకేతనం ఎగురవేసింది.
𝗦𝘂𝗿𝘆𝗮𝗸𝘂𝗺𝗮𝗿 𝗦𝗽𝗲𝗰𝗶𝗮𝗹 😎
Trademark way to get off the mark ✅@mipaltan cruising in the chase 🛳️
Updates ▶ https://t.co/iEwchzEpDk#TATAIPL | #MIvKKR | @surya_14kumar pic.twitter.com/Ag46xegPOW
— IndianPremierLeague (@IPL) March 31, 2025
కోల్‌కతాను తక్కువకే కట్టడి చేసిన ఆనందం ముంబైకి ఎంతో సేపు నిలవలేదు. అందుకు కారణం.. తొలి రెండు మ్యాచుల్లో విఫలమైన రోహిత్ శర్మ(13) వాంఖడేలోనూ నిరాశపరిచాడు. ఆండ్రూ రస్సెల్ వేసిన 6వ ఓవర్ రెండో బంతికి భారీ షాట్ ఆడగా.. హర్షిత్ రానా పరుగెడుతూ చక్కని క్యాచ్ అందుకున్నాడు. దాంతో, 46 వద్ద ముంబై తొలి వికెట్ పడింది. విల్ జాక్స్(11), ఓపెనర్ రియాన్ రికెల్టన్(62 నాటౌట్)లు జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్నారు. ఇద్దరూ బౌండరీలతో విరుచుకు పడ్డారు. ఈ క్రమంలోనే రియాన్ తొలి అర్థ శతకం సాధించాడు. ఫిఫ్టీ తర్వాత మరింత దూకుడుగా ఆడిన అతడు.. లక్ష్యాన్ని కరిగించాడు.
Maiden fifty in #TATAIPL 🫡
Maiden fifty for #MI 💙Ryan Rickelton is putting on a show in front of the home crowd 👏👏
Updates ▶ https://t.co/iEwchzEpDk#MIvKKR pic.twitter.com/5dtWZj0HRB
— IndianPremierLeague (@IPL) March 31, 2025
రస్సెల్ బౌలింగ్‌లో విల్ జాక్స్(16) ఔటయ్యాక .. సూర్యకుమార్ యాదవ్(27 నాటౌట్) తన మర్క్ బ్యాటింగ్‌తో కోల్‌కతా బౌలర్లకు చుక్కలు చూపించాడు. రస్సెల్ వేసిన 13వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన సూర్య.. ఐదో బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. దాంతో, 8 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది ముంబై.
సొంత గడ్డపై ముంబై ఇండియన్స్ పంజా విసిరింది. పేసర్లు కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లును హడలెత్తించారు. దాంతో, కోల్‌కతా ఈ ఎడిషన్‌లోనే అత్యల్ప స్కోర్‌కు ఆలౌటైంది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి వరుసగా వికెట్లు తీస్తూ కేకేఆర్‌పై ఒత్తిడి పెంచారు ముంబై బౌలర్లు. ట్రెంట్ బౌల్ట్ తన తొలి ఓవర్లోనే డేంజరస్ సునీల్ నరైన్(0)ను బౌల్డ్ చేసి బ్రేకిచ్చాడు. ఆ తర్వాత దీపక్ చాహర్ ఓవర్లో ఓపెనర్ క్వింటన్ డికాక్(1) వెనుదిరిగాడు. అక్కడితో కోల్‌కతా కష్టాలు పెరుగుతూ పోయాయి.
Innings Break!
A superb bowling display by the #MI bowlers to dismiss #KKR for 116 in 16.2 overs 🎯@mumbaiindians‘ chase on the other side ⏳
Scorecard ▶ https://t.co/iEwchzDRNM#MIvKKR pic.twitter.com/R5i58lKBXC
— IndianPremierLeague (@IPL) March 31, 2025
ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన అశ్వనీ కుమార్(4-24) సంచలన బౌలింగ్ చేయడంతో కేకేఆర్ బ్యాటర్లు తడబడ్డారు. అజింక్యా రహానే(11) రింకూ సింగ్(17), ఇంప్యాక్ట్ ప్లేయర్ మనీశ్ పాండే(19), ఆండ్రూ రస్సెల్ వికెట్లు తీసి కోల్‌కతా పతనాన్ని శాసించాడు. ఆఖర్లో రమన్‌దీప్ సింగ్(22 12 బంతుల్లో1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. అయితే.. శాంట్నర్ వేసిన 17వ ఓర్ రెండో బంతికి రమన్‌దీప్ ఔట్ కావడంతో.. కేకేఆర్ 116 పరుగులకే కుప్పకూలింది.