IPL 2025 : స్వల్ప ఛేదనలో ముంబై ఇండియన్స్(Mumbai Indians) బ్యాటర్లు దంచేస్తున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ(13) మరోసారి విఫలమైనా ఓపెనర్ రియాన్ రికెల్టన్(43 28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడుతున్నాడు. తొలి రెండు ఓవర్లు ఇబ్బందిపడ్డ రియాన్.. ఆ తర్వాత జోరు పెంచాడు. హర్షిత్ రానా బౌలింగ్లో లెగ్ సైడ్ భారీ సిక్సర్ బాదాడు. విల్ జాక్స్(11)తో కలిసి జట్టు విజయానికి బలమైన పునాది వేస్తున్నాడు. 8 ఓవర్లకు ముంబై స్కోర్..70-1.
ఐపీఎల్లో చెలరేగి ఆడే రోహిత్ శర్మ(13) మళ్లీ నిరాశపరిచాడు. ఫామ్ లేమిని కొనసాగిస్తూ పెవిలియన్ చేరాడు. తొలి రెండు ఓవర్లలో స్వింగ్ కావడంతో ఆచితూచి ఆడిన హిట్మ్యాన్.. పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఆండ్రూ రస్సెల్ వేసిన 6వ ఓవర్ రెండో బంతికి భారీ షాట్ ఆడగా.. హర్షిత్ రానా పరుగెడుతూ చక్కని క్యాచ్ అందుకున్నాడు. దాంతో, 46 వద్ద ముంబై తొలి వికెట్ పడింది. ప్రస్తుతం విల్ జాక్స్(11), ఓపెనర్ రియాన్ రికెల్టన్(43)లు జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్నారు.
The clarity in both these shots 😇
Ryan Rickelton with no half measures in the chase 💪#MI lose Rohit Sharma and are 55/1 after 6 overs.
Updates ▶ https://t.co/iEwchzEpDk#TATAIPL | #MIvKKR | @mipaltan pic.twitter.com/3keQ745xn2
— IndianPremierLeague (@IPL) March 31, 2025