Venkatesh | విక్టరీనే తన ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్ ఇప్పటికీ మంచి విజయాలతో దూసుకుపోతున్నారు. వెంకటేష్ సినిమా అంటే ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూసేలా ఉంటుంది. వెండితెరపై వెంకటేష్‌ని చూసిన తర్వాత పెళ్లి కాని మహిళలు తమకి ఇలాంటి భర్త దొరికితే బాగుంటుంది కదా అని అనుకుంటారు. వెంకటేష్‌కి లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే. ఆయనతో పని చేసిన చాలా మంది హీరోయిన్స్‌కి కూడా వెంకీ ఫేవరేట్ స్టార్. అయితే ఓ హీరోయిన్ అయితే వెంకటేష్‌ని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో పెద్ద గొడవే చేసిందట. ఆమె ఎవరో కాదు.. అప్పట్లో ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ రాశి. అప్పట్లో యూత్ ఆడియన్స్ ని తెగ అట్రాక్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
బాలనటిగా ఇండస్ట్రీకి వచ్చిన రాశి ఓ సారి మేగజీన్‌పై వెంకటేష్ ఫోటోలు చూసి అతనికి ఫిదా అయిందట. వెంకీ హీరోగా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు రాశి టీనేజ్‌లో ఉందట. అయితే వెంకీని చూడగానే తాను వెంకటేష్‌ని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో గొడవ పెట్టుకుందట రాశి. వెంకటేష్ లాంటి పెళ్ళైన హీరోని రాశి పెళ్లి చేసుకుంటా అనడంతో రాశీ పేరెంట్స్ నోరెళ్లపెట్టారట. ఇలా చిన్నప్పుడే తన క్రష్ వెంకీ అయ్యారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రాశి. కాగా, రాశీని పెళ్లి చేసుకోడానికి బిజినెస్ మెన్స్ ఎందరో క్యూ కట్టారు. కానీ వాళ్లందరినీ కాదని ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌ను పెళ్లి చేసుకుంది రాశి. అతడి పేరు శ్రీముని. రాశి నటించిన సినిమాకి ఆయన సహాయక దర్శకుడిగా పని చేశాడు. అప్పుడే వాళ్ల మధ్య పరిచయం ఏర్పడి తర్వాత ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది.
ఇక వెంకటేష్ విషయానికి వస్తే నిర్మాత డి.రామానాయుడు కుమారుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వెంకటేష్ కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేశారు. చంటి, కలిసుందాం రా, సుందరకాండ, రాజా, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, పవిత్రబంధం, సూర్యవంశం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్ధాలే వంటి చిత్రాలు వెంకీ కెరియర్లో మైలురాళ్లుగా నిలిచిపోతాయి. ఇప్పుడు కూడా వెంకీ సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తున్నారు. F2, F3, సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ హిట్స్ రాబట్టి దూసుకుపోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా సీనియర్ హీరోల్లో 300 కోట్లు సాధించిన తొలి హీరోగా రికార్డు సృష్టించారు వెంకటేష్.