KTR | బుల్డోజర్లు పెద్ద ఎత్తున హైదరాబాద్ యూనివర్సిటీలో మోహరించడంతో అక్కడే ఉన్న వన్యప్రాణులన్నీ అరుస్తున్నాయని.. అవి రాహుల్ గాంధీకి వినపడడం లేదా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఆయన విద్యార్థులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి సూటి ప్రశ్నలు వేశారు. హైకోర్టులో ఇప్పటికే ఈ అంశంపై పర్యావరణహితం కోసం ప్రజా ప్రయోజన రాజ్యం వేయడం జరిగిందని.. అయితే, ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల కన్నా ముందే అరాచకంగా వ్యవహరిస్తున్నది? మండిపడ్డారు. ఎందుకు రాహుల్ గాంధీ స్పందించడం లేదని.. గతంలో రాహుల్ గాంధీ సెంట్రల్ యూనివర్సిటీకి రెండుసార్లు వచ్చి వెళ్లారని.. మరీ అలాంటిది విద్యార్థులపైన ఇన్ని అరాచకాలు జరుగుతున్న పర్యావరణంపైన ఇంత అక్రమంగా తమ సొంత ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. ఇదే రాహుల్ గాంధీ గతంలో ముంబయి ఆరాయి అడవులపై జాతీయస్థాయిలో మాట్లాడారని.. ఇదే రాహుల్ గాంధీ ఛత్తీస్గఢ్లో హస్దేయో అడవులను ఇతరులకు కేటాయించకుండా రాహుల్ గాంధీ మాట్లాడారన్నారు.
ఇలాంటి రాహుల్ గాంధీ ఈ రోజు హైదరాబాద్ నుంచి భవిష్యత్తును పిల్లల భవిష్యత్తును రాష్ట్ర ప్రభుత్వం పణంగా పెడుతుంటే మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన మీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాల్సిన అవసరం లేదా? రాహుల్ గాంధీ ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూములపైన చేస్తున్న రాజకీయం వలన ఇబ్బందులు పడుతున్న పిల్లలు, పర్యావరణం, వన్యప్రాణుల రోదనలు మీకు వినిపించడం లేదా? రాహుల్ గాంధీ అంటూ ప్రశ్నించారు. విద్యార్థులకు మా పార్టీ తరఫున భరోసా ఇచ్చామని, ఆ పార్టీ తరఫున మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అడుగుతామని.. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందే రియల్ ఎస్టేట్ అంటే.. నేను రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ అని మాట చెప్పాడని.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫుట్బాల్ ఆడి మరీ అక్కడున్న భూములపైనే కన్ను వేశాడన్నారు. అందుకే పిల్లలు, పర్యావరణం, సెంట్రల్ యూనివర్సిటీ ఏమైనా సరే ఆ భూములు వదిలిపెట్టనని ఈ రోజు అరాచకంగా వ్యవహరిస్తున్నారన్నారు. మా పార్టీ తరఫున సెంట్రల్ యూనివర్సిటీకి రావాలని అనేకమంది అడుగుతున్నారని.. విద్యార్థుల ఆందోళనను రాజకీయ అభివృద్ధి చేస్తాడని.. అందుకే మా పార్టీ తరఫున ఇప్పటిదాకా నేరుగా పోలేదన్నారు. సరైన వేదికలపైన ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు. పార్లమెంట్ రాజ్యసభలో మా పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని హామీ ఇచ్చారు. ప్రజాక్షేత్రంలో కూడా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.
ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటే భవిష్యత్ తరాలకు శ్మశానాలకు కూడా జాగాలు ఉండవని అంటూ చెప్పింది రేవంత్ రెడ్డి కాదా? మరీ ఇప్పుడు అవన్నీ రేవంత్ రెడ్డి మర్చిపోయాడన్నారు. పిల్లలు ఇద్దరు యూనివర్సిటీ పిల్లలను అరెస్టు చేశారని, జైలుకి పంపించారని చెబుతున్నారు వారికి అండగా ఉంటామన్నారు. వాళ్లకి న్యాయపరంగా అన్ని రకాల సహకారం అందిస్తామన్నారు. ఆ ఇద్దరు విద్యార్థుల ఆచూకీని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టాలని.. మేరకు డీజీపీని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. వైస్ చాన్సెలర్ అనుమతులు లేకుండా పోలీసులు వెళ్తున్నారన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోకి వెళ్లే పోలీసులకు ఉండదని.. కానీ విచ్చలవిడిగా పోలీసులను పంపించి విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారన్నారు. ఆడ విద్యార్థినులను కూడా ఇబ్బందులు పెడుతున్నారని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మాజీ విద్యార్థులైన భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు లాంటి వాళ్లు ఈ అంశంలో ఎందుకు మాట్లాడట్లేదని.. వారికి పిల్లల తరఫున నిలబడేందుకు మనసు రావడం లేదన్నారు. ఈ అంశంలో అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బీజేపీతో పాటు ఇతర పార్టీలను కూడా డిమాండ్ చేస్తున్నామన్నారు.