IND vs ENG 2nd Test రెండో టెస్టులో టీమిండియా(Team India) విజయం దిశగా సాగుతోంది. నాలుగో రోజు తొలి సెషన్లోనే కీలకమైన మూడు వికెట్లు పడగొట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ తీయలేకపోయిన అశ్విన్ రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఉప్పల్ టెస్టులో సూపర్ సెంచరీతో ఇంగ్లండ్‌ను ఆదుకున్న ఓలీ పోప్(23), జో రూట్(16) ఔట్ చేశాడు.
స్లిప్‌లో రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్‌తో పోప్ నిరాశగా పెవిలియన్‌కు చేరగా.. అక్షర్ పటేల్ చేతికి చిక్కిన రూట్ డగౌట్‌కు చేరాడు. దాంతో స్టోక్స్ సేన 154 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. మరోవైపు బజ్ బాల్ ఆటతో చెలరేగిపోతున్న ఓపెనర్ జాక్ క్రాలే(55 నాటౌట్) హాఫ్ సెంచరీ సాధించాడు.
Sharp Reflexes edition, ft. captain Rohit Sharma! 👌 👌
Follow the match ▶️ https://t.co/X85JZGt0EV#TeamIndia | #INDvENG | @ImRo45 | @IDFCFIRSTBank pic.twitter.com/mPa0lUXC4C
— BCCI (@BCCI) February 5, 2024
అక్షర్ పటేల్ బౌలింగ్‌లో బౌండరీతో క్రాలే ఈ టెస్టులో రెండో ఫిఫ్టీ బాదాడు. స్టోక్స్ సేన 4 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 244 పరుగులు అవసరమవ్వా.. టీమిండియాకు 6 వికెట్లు కావాలి.
𝙈. 𝙊. 𝙊. 𝘿 👏 👏@ashwinravi99 on a roll! 👍 👍
England 4 down as Joe Root gets out.
Follow the match ▶️ https://t.co/X85JZGt0EV #TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/YmRhEnBwwQ
— BCCI (@BCCI) February 5, 2024
రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్(104) సెంచరీ బాదడంతో భారత్ భారీ స్కోర్ దిశగా పయనించింది. అయితే.. షోయబ్ బషీర్ సూపర్ బంతితో గిల్‌ను ఔట్ చేయగా.. ఆ తర్వాత టామ్ హర్ట్లే నాలుగు వికెట్లతో ఇండియాను దెబ్బకొట్టాడు. దాంతో, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ను 255 పరుగులకే కట్టడి చేసింది.