IND vs BAN 1st Test : భారత సీనియర్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్(75), రవీంద్ర జడేజా(51)లు హాఫ్ సెంచరీతో చెలరేగారు. చెపాక్ మైదానంలో ఇద్దరూ బౌండరీల మోతతో బంగ్లాదేశ్ బౌలర్లపై విరుచుకు పడ్డారు. మొదట అశ్విన్ అర్ధ శతకానికి చేరువయ్యాడు. ఆ కాసేపటికే హసన్ మహమూద్ ఓవర్లో బౌండరీతో జడేజా ఫిఫ్టీ సాధించాడు. ఆ వెంటనే తన స్టయిల్లో కత్తిసాముతో ఫ్యాన్స్‌ను అలరించాడు. టెస్టుల్లో జడేజాకు ఇది 21వ హాఫ్ సెంచరీ.
అశ్విన్, జడేజాలు అసమాన పోరాటంతో భారత్ కోలుకుంది. వీళ్లిద్దరూ ఏడో వికెట్‌కు రికార్డు స్థాయిలో శతక భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం టీమిండియా స్కోర్.. 275/6. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పిచ్ పేస్‌కు అనూకలించడంతో రెచ్చిపోయాడు.
Ravindra Jadeja joins the party with his 21st Test FIFTY 👌🙌
Live – https://t.co/jV4wK7BgV2… #INDvBAN@IDFCFIRSTBank | @imjadeja pic.twitter.com/ygmMlagxwk
— BCCI (@BCCI) September 19, 2024
తొలి సెషన్లోనే మూడు కీలక వికెట్లు తీసి టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టాడు. అయితే.. యశస్వీ జైస్వాల్(56), రిషభ్ పంత్(39) సమయోచితంగా ఆడి స్టోర్ బోర్డును ముందుకు నడిపారు. లంచ్ తర్వాత పంత్ త్వరగానే ఔటయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్(16) జతగా ఇన్నింగ్స్ నిర్మించిన యశస్వీ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు.
FIFTY!@ybj_19 with a solid half-century. His 5th in Test cricket 👏👏
Live – https://t.co/jV4wK7BgV2… #INDvBAN@IDFCFIRSTBank pic.twitter.com/mKIJbBKYHm
— BCCI (@BCCI) September 19, 2024
ప్రమాదకరంగా మారుతున్న యశస్వీని నిషద్ రానా వెనక్కి పంపాడు. ఆ కాసేపటికే రాహుల్ అతడిని అనుసరించాడు. ఆ దశలో టీమిండియా స్కోర్ దాటుతుందా? లేదా? అనే చిన్న సందేహం. కానీ, మన ఆల్‌రౌండర్లు అశ్విన్(75), జడేజా(51)లు క్రీజులో పాతుకుపోయారు. బంగ్లా బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ పరుగుల సాధించారు. అలాగని జిడ్డు ఆట ఆడలేదు వీళ్లు. బౌండరీలతో బంగ్లాదేశ్ బౌలర్ల లయను దెబ్బతీశారు.