Canada Visas | 2025లో విద్యార్ధి వీసాల్లో 10 శాతం కోత : కెనడా
Canada Visas : కెనడాలో నివసించాలని, పనిచేయాలని కోరుకునే భారతీయులకు షాకింగ్ న్యూస్ ఎదురైంది. అంతర్జాతీయ విద్యార్ధులు, తాత్కాలిక విదేశీ కార్మికులు లక్ష్యంగా వలస నిబంధనల్లో సవరణలకు ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం సన్నద్ధమైంది.
Canada Visas : కెనడాలో నివసించాలని, పనిచేయాలని కోరుకునే భారతీయులకు షాకింగ్ న్యూస్ ఎదురైంది. అంతర్జాతీయ విద్యార్ధులు, తాత్కాలిక విదేశీ కార్మికులు లక్ష్యంగా వలస నిబంధనల్లో సవరణలకు ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ ఏడాది అంతర్జాతీయ స్టూడెంట్ పర్మిట్స్లో 35 శాతం కోత విధించనున్నామని, 2025లో 10 శాతం కోత విధిస్తామని ట్రూడో గురువారం ట్వీట్ చేశారు.
తమ ఆర్ధిక వ్యవస్ధకు వలసలు కీలకమని, కానీ వ్యవస్ధను కొందరు దుర్వినియోగం చేస్తూ విద్యార్ధుల ప్రయోజనాలను పొందినప్పుడు తాము అణిచివేయకతప్పదని ఆయన స్పష్టం చేశారు. ఇక విదేశీ విద్యార్ధుల వీసాలు భారీగా తగ్గిస్తామని ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిలర్ ఇప్పటికే తేల్చిచెప్పారు. 2024తో పోలిస్తే వచ్చే ఏడాది అంతర్జాతీయ విద్యార్ధుల రాకపై పరిమితి పదిశాతం తగ్గిస్తామని వెల్లడించారు. 2026లోనూ విద్యార్ధి వీసాల పరిస్ధితి నిలకడగా ఉంటుందని ఇది 2023 స్ధాయిలతో పోలిస్తే 36 శాతం తక్కువని తెలిపారు.
మరోవైపు విదేశీ విద్యార్ధులు తక్కువ సంఖ్యలో దరఖాస్తులు చేస్తున్నారని, ఇలాగైతే 2024కు నిర్ధేశించిన లక్ష్యాలను దేశం చేరుకోలేదని కెనడాలో యూనివర్సిటీలు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం మాత్రం వీసాల కుదింపు ప్రణాళికలతోనే ముందుకెళుతోంది. కెనడాలో జనాభా విపరీతంగా పెరుగుతుండటంతో గృహాల వ్యయాలు, సేవల వ్యయాలు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో ట్రూడో వలస విధానాలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. దీంతో దిక్కుతోచని స్ధితిలో తాత్కాలిక నివాసితులు, విదేశీ విద్యార్ధులు సహా తాత్కాలిక ఉద్యోగుల వీసాలను కుదించాలని నిర్ణయించింది.
Read More :
HYDRAA | అపవాదు నుంచి బయటపడేందుకు.. హైరైజ్ పైకి హైడ్రా బుల్డోజర్లు!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

