Delhi CM Oath | ఐదుగురు మంత్రులతో సీఎంగా అతిషి ప్రమాణం..! కొత్త ముఖాలకు కేబినెట్ బెర్తులు..!
Delhi CM Oath | ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ఈ నెల 21న ప్రమాణస్వీకారం చేయనున్నారు. సీఎంతో కలిపి ఐదుగురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఇందులో గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు.
Delhi CM Oath | ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ఈ నెల 21న ప్రమాణస్వీకారం చేయనున్నారు. సీఎంతో కలిపి ఐదుగురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఇందులో గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు. ఈ సారి కొత్తగా ముఖేష్ అహ్లావత్ సైతం కేబినెట్‌గా ప్రమాణం సైతం ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. ఆయన సుల్తాన్‌పురి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కేబినెట్లో మంత్రిగా కొనసాగిన అతిషి సీఎంగా నియామకయ్యారు. సీఎంతో పాటు మంత్రులు సైతం ఈ నెల 21న ప్రమాణస్వీకారం చేస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. ఆ ప్రతిపాదనలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. కేజ్రీవాల్ తన రాజీనామాతో పాటు కొత్త సీఎంగా అతిషి పేరును ప్రతిపాదిస్తూ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఎల్జీకి ప్రతిపాదనలు అందజేశారు. అలాగే, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సైతం ప్రతిపాదనలు పంపారు. రాష్ట్రపతి ఆమోదం నేపథ్యంలో శనివారం ప్రమాణస్వీకారం తేదీని ఎల్జీ స్వచ్ఛంగా నిర్ణయించారు. కేజ్రీవాల్ రాజీనామా నేపథ్యంలో సాంకేతికంగా మంత్రివర్గం మొత్తం రద్దవుతుంది. దాంతో అతిషితో పాటు మంత్రివర్గం సైతం ప్రమాణం చేయనున్నది. గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలకు తొలిసారిగా కేబినెట్ బెర్తులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

