IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో మరో ఉత్కంఠ పోరు.. టాపార్డర్ విఫలమైనా మిడిలార్డర్, టెయిలెండర్ల అసమాన పోరాటం కనబరచగా ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క వికెట్ తేడాతో భారీ విజయం సాధించింది. అశుతోష్ శర్మ(66 నాటౌట్) సూపర్ ఫిఫ్టీతో జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. విప్రజ్ నిగమ్(39), ట్రిస్టన్ స్టబ్స్(34)ల మెరుపులతో ఓటమి అంచు నుంచి బయటపడిన ఢిల్లీ.. చివరకు లక్నో సూపర్ జెయింట్స్‌కు ఊహించని షాకిచ్చింది.
ఢిల్లీ, లక్నో మధ్య జరిగిన మ్యాచ్ ఫ్యాన్స్‌కు అసలైన క్రికెట్ మజాను అందించింది. భారీ ఛేదనలో వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచిన ఢిల్లీ అనూహ్యంగా పంత్ సేనకు షాకిచ్చింది. 209 పరుగుల ఛేదనలో శార్దూల్ ఠాకూర్ హడలెత్తించగా తొలి ఓవర్లోనే ఓపెనర్ ఫ్రేజర్ మెక్‌గుర్క్(1), అభిషేక్ పొరెల్(0) వికెట్లు కోల్పోయింది. ఆపై సిద్ధార్థ్ బౌలింగ్‌లో సమీర్ రిజ్వీ(4) వికెట్ కీపర్ పంత్ చేతికి దొరికిపోయాడు. పవర్ ప్లేలో ధాటిగా ఆడిన కెప్టెన్ అక్షర్ పటేల్(22) సైతం వెనుదిరగగా ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో పడింది. .. 6 ఓవర్లకు ఢిల్లీ 58 పరుగులు చేసింది. ప్రస్తుతం ఫాఫ్ డూప్లెసిస్(23), ట్రిస్టన్ స్టబ్స్(34)లు కీలక ఇన్నింగ్స్ ఆడారు. గత సీజన్లో దంచిన స్టబ్స్ ఫామ్ కొనసాగిస్తూ స్వీప్ షాట్లతో బౌంబరీలు రాబట్టాడు.
We are in for a show, folks 🍿
Spirited fightback from @DelhiCapitals 💪#DC need 3⃣9⃣ runs off 1⃣8⃣ deliveries
Updates ▶ https://t.co/aHUCFODDQL#TATAIPL | #DCvLSG pic.twitter.com/5QEvVcnmuW
— IndianPremierLeague (@IPL) March 24, 2025
సిద్ధార్థ వేసిన 13వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన అతడు.. మూడో బంతికి బౌల్డయ్యాడు.. ఆ తర్వాత విప్రజ్ నిగమ్(39) ఉన్నంత సేపు బౌండరీలతో చెలరేగాడు. ఒంటిచేత్తో భారీ సిక్సర్లు బాదాడు. దాంతో, 13, 14, 15వ ఓవర్లలో 15కు పైగా రన్స్ వచ్చాయి. దాంతో, సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రిన్స్ వేసిన 16వ ఓవర్లో అశుతోష్ 6, 4 .. విప్రజ్ రెండు ఫోర్లు సాధించగా ఢిల్లీ స్కోర్ 168కి చేరింది. కానీ, టైమ్ ఔట్ అనంతరం ఢిల్లీ టెయిలెండర్లు వరుసగా పెవిలియన్ చేరినా అశుతోష్ శర్మ(66 నాటౌట్) పట్టు విడవలేదు. చివరి 12 బంతుల్లో 22 రన్స్ అవసరం కాగా కుల్దీప్ బౌండరీ కొట్టి.. తర్వాత బంతికి రనౌట్ అయ్యాడు. ఆ దశలో అశుతోష్ ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా 6,4తో జట్టు స్కోర్ 200 దాటించాడు. ఆఖరి ఓవర్లో సిక్సర్‌తో మ్యాచ్ ముగించాడు.