IPL 2025 : భారీ ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. శార్దూల్ ఠాకూర్ హడలెత్తించగా తొలి ఓవర్లోనే ఓపెనర్ ఫ్రేజర్ మెక్గుర్క్(1), అభిషేక్ పొరెల్(0) వికెట్లు కోల్పోయింది. ఆపై సిద్ధార్థ్ బౌలింగ్లో సమీర్ రిజ్వీ(4) వికెట్ కీపర్ పంత్ చేతికి దొరికిపోయాడు. పవర్ ప్లేలోనే కెప్టెన్ అక్షర్ పటేల్(22) సైతం వెనుదిరగగా ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో పడింది. .. 6 ఓవర్లకు ఢిల్లీ 58 పరుగులు చేసింది. ప్రస్తుతం ఫాఫ్ డూప్లెసిస్(23), ట్రిస్టన్ స్టబ్స్(2) క్రీజులో ఉన్నారు.
ఐపీఎల్ 18వ సీజన్లో పవర్ హిట్టర్లు చెలరేగిపోతున్నారు. క్రీజులోకి రావడమే ఆలస్యం బౌండరీలతో వీరంగం సృష్టిస్తున్నారు. సోమవారం వైజాగ్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు దంచేశారు. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లతో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను ఊచకోత కోశారు. దాంతో, లక్నోనిర్ణీతో ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.