IPL 2025 : ఐపీఎల్ 18వ ఎడిషన్‌లో విధ్వంసక బ్యాటింగ్‌తో అలరిస్తున్నారు కొందరు కుర్రాళ్లు. క్లిష్ట సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడుతూ జట్టును ఆదుకుంటున్నారు. అలవోకగా పెద్ద షాట్లు ఆడుతూ ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పేస్తున్నారు. వీళ్లలో అశుతోష్ శర్మ(Ashutosh Sharma) పేరు ముందు వరుసలో ఉంటుంది. అతడు క్రీజులోకి వస్తే చాలు బౌలర్లు వణికిపోతున్నారు. ఒత్తిడిలోనూ మెరుపు షాట్లతో అలరించే ఈ కుర్రాడు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ట్రబుల్ షూటర్(Troubleshooter)గా మారాడు. అవును.. బౌలర్ల పాలిట సింహస్వప్నంగా మారిన అతడు ఎంతటి కష్ట సమయంలోనైనా జట్టును ఒడ్డున పడేస్తున్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ల ధాటికి 62 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఢిల్లీకి ఆపద్భాదంవుడయ్యాడీ హిట్టర్. తన పవర్ స్ట్రోక్‌తో అలరించిన అశుతోష్ 26 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 రన్స్ చేసి.. అక్షర్ పటేల్ బృందానికి పోరాడగలిగే స్కోర్ అందించాడు. ఉప్పల్ స్టేడియంలో అతడి విధ్వంసాన్ని కళ్లారా చూసిన ప్రతి ఒక్కరు ఢిల్లీ ట్రుబల్షూటర్ అనే పదానికి అశుతోష్ నూరుపాళ్లు న్యాయం చేస్తున్నాడని అంటున్నారు.
Batting collapse? Better call Ashutosh Sharma, maybe! pic.twitter.com/GeX0so96fb
— CricTracker (@Cricketracker) May 5, 2025
నిజానికి 17వ సీజన్లోనే అశుతోష్ పేరు మార్మోగిపోయింది. పంజాబ్ కింగ్స్‌కు ఆడిన ఈ చిచ్చరపిడుగు ఆ జట్టు చిరస్మరణీయ విజయాల్లో భాగమయ్యాడు. ఇప్పుడు ఢిల్లీ బ్యాటింగ్ లైనప్‌లో కీలక ఆటగాడిగా ఎదిగాడు అశుతోష్. ప్రతి మ్యాచ్‌లో తన మార్క్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడీ యంగ్‌స్టర్. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 ఓవర్లో క్రీజులోకి వచ్చిన అశుతోష్ 19 బంతుల్లోనే 37 రన్స్ సాధించాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లను ఉతికారేసిన ఈ కుర్రాడు కేవలం 28 బంతుల్లోనే 61 పరుగులతో రెచ్చిపోయాడు.
SMACKED…and again! 🔥
Ashutosh Sharma adding the much-needed fire to #DC‘s innings 💪
Updates ▶ https://t.co/1MkIwk4VNE#TATAIPL | #SRHvDC | @DelhiCapitals pic.twitter.com/sMA3ZLKotz
— IndianPremierLeague (@IPL) May 5, 2025
ఇక సోమవారం ఉప్పల్ మైదానంలో ఈ యంగ్‌స్టర్ ట్రిస్టన్ స్టబ్స్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో అశుతోష్ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఐదు ఓవర్ల ఆట కూడా సాధ్యంకాకపోవడంతో అంపైర్లు ఇరుజట్లకు చెరొక పాయింట్ కేటాయించారు. దాంతో, కమిన్స్ సేన టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఢిల్లీ 11 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. ఈ ఎడిషన్‌లో ఢిల్లీ బ్యాటింగ్ అస్త్రంగా ఉపయోగిస్తున్న అశుతోష్ 8 ఇన్నింగ్స్‌ల్లో 167.56 స్ట్రయిక్ రేటుతో 186 రన్స్ కొట్టాడు.