Shah Rukh Khan | మెట్ గాలా అనగానే మొదటిసారి భయపడ్డాను : షారుఖ్ ఖాన్
Met Gala 2025 | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మొట్టమొదటిసారిగా మెట్ గాలా 2025 వేడుకలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ వేడుకలకు హాజరైన తొలి భారతీయ నటుడిగా రికార్డు సృష్టించారు.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మొట్టమొదటిసారిగా మెట్ గాలా 2025 వేడుకలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ వేడుకలకు హాజరైన తొలి భారతీయ నటుడిగా రికార్డు సృష్టించారు. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్‌లో జరిగిన ఈ వేడుకలో తొలిసారి కనిపించి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు కింగ్ ఖాన్ షారుక్. ఈ సందర్భంగా వేడుకలో తన అనుభవాలను పంచుకున్నారు. తాను ఈ వేడుకకు హాజరయ్యేముందు చాలా భయపడ్డానని షారుఖ్ తెలిపాడు. ప్రముఖ డిజైనర్ సబ్యసాచి తనను ఒప్పించడంతోనే తాను మెట్ గాలాకు వచ్చానని ఆయన చెప్పారు.
షారుఖ్ మాట్లాడుతూ.. ఏదైన వేడుకకి వెళ్లాలంటే నాకు చాలా సిగ్గు. అందుకే ఎక్కువ రెడ్ కార్పెట్ ఈవెంట్లకు హాజరు కాలేదు. ఇది నాకు మొదటిసారి. నిజానికి నేను చాలా నర్వస్‌గా ఉన్నాను, ఇప్పుడే ఇక్కడి నుంచి పారిపోవాలని ఉందని అని అన్నారు. అయితే, తన పిల్లలైన ఆర్యన్, సుహానా, అబ్రామ్ ఈ వేడుక గురించి చాలా ఉత్సాహంగా ఉన్నారని షారుఖ్ తెలిపారు. “నా పిల్లలు మెట్ గురించి చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నారు. బహుశా వాళ్ల కోసమే నేను ఇక్కడకు వచ్చాను. సబ్యసాచి నన్ను రమ్మని అడిగినప్పుడు వాళ్లు ‘వావ్!’ అన్నారు. నన్ను పిలిచారని వాళ్లు ఆశ్చర్యపోయారో, లేక నేను బాగా కనిపిస్తానని అనుకున్నారో నాకు ఇంకా అర్థం కాలేదు” అని షారుఖ్ నవ్వుతూ చెప్పారు.
సబ్యసాచి మాట్లాడుతూ.. షారుఖ్ ఖాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ వ్యక్తుల్లో ఒకరని, ఆయనకు లెజెండరీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అన్నారు. షారుఖ్‌ను బ్లాక్ డాండీగా చూపించడం తమ ఉద్దేశమని, ఆయనను ఆయనలాగే చూపించాలని తాము కోరుకున్నామని సబ్యసాచి తెలిపారు. షారుఖ్ ఖాన్ మెట్ గాలాలో ధరించిన దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆయన ఒక పొడవైన బ్లాక్ కోటు, టస్మానియన్ సూపర్‌ఫైన్ ఉన్నితో తయారు చేయబడిన చొక్కా మరియు ప్యాంటు ధరించారు. దీనికి తోడుగా ఆయన మెడలో ‘కె’ అనే అక్షరం ఉన్న లాకెట్టు మరియు చేతిలో పులి తల ఆకారంలో ఉన్న కర్రను పట్టుకున్నారు. షారుఖ్ మొదటిసారి మెట్ గాలాకు హాజరు కావడంతో ఆయన అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన లుక్ మరియు ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

