IPL 2025 | గుజరాత్‌తో కీలక మ్యాచ్.. సిరాజ్‌కు డైమండ్ రింగ్ ఇచ్చిన రోహిత్..!
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో నిప్పులు చెరుగుతున్న మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) విలువైన బహుమతి అందుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో కీలక మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ(Rohit Sharma) నుంచి స్పెషల్ రింగ్‌ను స్వీకరించాడు.
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో నిప్పులు చెరుగుతున్న మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) విలువైన బహుమతి అందుకున్నాడు. ముంబై ఇండియన్స్(Mumbai Indians)తో కీలక మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ(Rohit Sharma) నుంచి స్పెషల్ రింగ్‌ను స్వీకరించాడు. బంగారు, వజ్రాలతో కూడిన ఉంగురాన్ని వాంఖడేలో హిట్‌మ్యాన్ ఈ స్పీడ్‌స్టర్‌కు బహూకరించాడు. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఇరుజట్ల మధ్య కీలక పోరు నేపథ్యంలో సిరాజ్‌కు రోహిత్ ఉంగురం ఎందుకు ఇచ్చాడు? అని అందరిలో ఆసక్తి నెలకొంది.
దాంతో, ఏంటీ సంగతి? అని అభిమానులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం సిరాజ్ తన వేలికి ఉంగురం పెట్టుకున్న ఫోటో, రోహిత్‌ను హత్తుకున్న ఫొటో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్ సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న వేళ సిరాజ్‌కు రోహిత్ డైమండ్ రింగ్ ఇవ్వడంపై ఊహాగానాలు వ్యాప్తి చెందుతున్నాయి.
𝙈𝙤𝙢𝙚𝙣𝙩 𝙩𝙤 𝘾𝙝𝙚𝙧𝙞𝙨𝙝 👏@mdsirajofficial receives a special ring from #TeamIndia Captain @ImRo45 for his impactful contributions in the team’s victorious ICC Men’s T20 World Cup 2024 campaign 💍@Dream11 pic.twitter.com/dHSnS4mwu1
— BCCI (@BCCI) May 5, 2025
అయితే.. ఆ ఉంగురాన్ని బీసీసీఐ (BCCI) తరఫున సిరాజ్‌కు అందించాడు హిట్‌మ్యాన్. నిరుడు టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2024)లో అద్భుతంగా రాణించి, టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించనందుకు ఈ స్పీడ్‌స్టర్‌కు ఈ రింగ్ లభించింది. వరల్డ్ కప్ విజేతలకు బీసీసీఐ మార్చిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి డైమండ్ రింగ్‌లను కానుకగా ఇచ్చింది. అయితే.. ఆ ఈవెంట్‌కు సిరాజ్ హాజరు కాలేదు. దాంతో, మంగళవారం వాంఖడేలో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ కోసం సిరాజ్ సోమవారమే ముంబై చేరుకున్నాడు.
ఇరుజట్ల ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ తర్వాత రోహిత్, సిరాజ్ కాసేపు ముచ్చటించుకున్నారు. ఆ సమయంలోనే ముంబై మాజీ సారథి అతడికి ఈ స్పెషల్ ఉంగురాన్ని, జ్ఞాపికను అందించాడు. ఈ వీడియోను బీసీసీఐ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. 60 గ్రాములు, 18 క్యారట్ల బంగారం, వజ్రాలతో రూపొందించిన ఈ రింగ్ ధర ఎంత అనేది మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు. ఐపీఎల్ 18వ ఎడిషన్‌లో గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరాజ్ 10 మ్యాచుల్లో 14 వికెట్లు పడగొట్టాడు.
ఇవి కూడా చదవండి
- Mock Drills | పాక్‌తో యుద్ధం.. రేపు హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో సెక్యూరిటీ మాక్ డ్రిల్స్
- OMC Case | ఒబుళాపురం మైనింగ్ కేసులో తుది తీర్పు.. గాలి జనార్దన్ రెడ్డి సహా ఐదుగురికి ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు
- IPL 2025 Playoff | ప్లేఆఫ్ రేసు నుంచి సన్‌రైజర్స్ అవుట్..! ఏ జట్లకు ఛాన్స్ ఉందంటే..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

