Mock Drills | హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో రేపు సెక్యూరిటీ మాక్ డ్రిల్స్
Mock Drills | హైదరాబాద్ (Hyderabad)లో మొత్తం నాలుగు ప్రాంతాల్లో రేపు సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ (Security Mock Drills) జరగనున్నాయి.
Mock Drills | పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. శత్రువుల నుంచి దాడులు ఎదురైన పక్షంలో పౌరులు సమర్థవంతంగా ఆత్మరక్షణ చేసుకునేందుకు పాటించాల్సిన అంశాలపై రేపు సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ (Security Mock Drills) నిర్వహించాలని ఆదేశించింది.
కేంద్రం ఆదేశాలతో తెలుగు రాష్ట్రాలతోపాటు రేపు మొత్తం 259 చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. ఇక హైదరాబాద్ (Hyderabad)లో మొత్తం నాలుగు ప్రాంతాల్లో ఈ డ్రిల్స్ జరగనున్నాయి. కంచన్‌బాగ్ డీఆర్డీవో, మౌలాలి ఎన్ఎఫ్సీ, సికింద్రాబాద్, గోల్కొండలో సాయంత్రం 4 గంటలకు సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా, మాక్డ్రిల్స్పై కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఆధ్వర్యంలో ఇవాళ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దాడులకు అవకాశం ఉన్న జిల్లాలను మూడు కేటగిరీలుగా విభజించారు. ప్రధాని నివాసం, త్రివిధ దళాల హెడ్ క్వార్టర్స్ ఉండడంతో కేటగిరి 1లో దేశ రాజధాని ఢిల్లీ, తారాపూర్ అణు కేంద్రం ఉన్నాయి. కేటగిరి 2లో తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, హైదరాబాద్‌లు ఉన్నాయి. రేపు మొత్తం 259 చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. కశ్మీర్, గుజరాత్, హిర్యాణా, అస్సాం, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అత్యధిక చోట్ల డ్రిల్స్‌కు ఏర్పాట్లు చేశారు.
మెట్రోలు, రక్షణ సంస్థలు, కీలక ప్రాజెక్టుల రక్షణ పైన రేపు మాక్ డ్రిల్ జరగనుంది. ఈ మాక్ డ్రిల్స్‌లో అధికారులతో పాటు సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డులు, ఎన్సీసీ/ ఎన్ఎస్ఎస్, నెహ్రూ యువకేంద్రాలు, కళాశాలలు/ పాఠశాలల విద్యార్థులను భాగస్వాముల్ని చేయనున్నారు. శత్రుదాడి జరిగినప్పుడు స్వీయరక్షణతో పాటు విద్యార్థులు, యువకులు ఎలా ప్రతిస్పందించాలో అవగాహన కల్పించాలని హోంశాఖ తెలిపింది.
54 ఏండ్ల తర్వాత
దేశంలో సెక్యూరిటీ మాక్‌డ్రిల్స్ నిర్వహణ కొత్తదేమీ కాదు. అదే సంవత్సరం 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసమని భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగింది. ఆ సమయంలో పౌరుల భద్రత కోసమని అప్పటి ప్రభుత్వం యుద్ధానికి ముందు సెక్యూరిటీ మాక్ డ్రిల్స్‌ను నిర్వహించింది. ఇప్పుడు 54 ఏండ్ల తర్వాత మళ్లీ ప్రభుత్వం మాక్‌డ్రిల్స్ నిర్వహిస్తున్నది.
Also Read..
Mock Drills | కేంద్ర హోంశాఖ కీలక సమావేశం.. రేపు 259 చోట్ల సెక్యూరిటీ మాక్ డ్రిల్స్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలోని 8 మున్సిపాలిటీల్లో నిలిచిన ఎన్నికల ప్రక్రియ..!
Saurav Das | సౌరవ్ దాస్, రాంకాలకు అదనపు జుడీషియల్ కస్టడీ కోరిన పోలీసులు.. ఆర్డర్ రిజర్వ్ చేసిన కోర్ట్
DGP CV Anand | అమరుల త్యాగాలతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు.. నిజాయితీగా సేవ చేయడమే వారికి నిజమైన నివాళి: డీజీపీ సీవీ ఆనంద్
‘తమపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోవాలి’
IND vs PAK | దేశంలో అస్థిరతకు భారత భద్రతా సలహాదారే కారణం.. మళ్లీ నోరు పారేసుకున్న పాకిస్థాన్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

