IPL 2025 Playoff | ఇండియన్ ప్రీమియర్ లీగ్ చివరి దశకు చేరుతున్నది. ఇప్పటికీ ఏయే జట్లు ప్లేఆఫ్‌కు చేరుతాయన్న క్లారిటీ లేదు. ప్రస్తుతం ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ప్లేఆఫ్ అవకాశాలున్నాయి. ఇప్పటికే చెన్నై, రాజస్థాన్ జట్లు ప్లేఆఫ్ నుంచి నిష్క్రమించాయి. సోమవారం జరిగిన మ్యాచ్‌తో హైదరాబాద్ జట్టు సైతం ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. సోమవారం సన్‌రైజర్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ వర్షార్పణమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలువాలని ఎస్ఆర్హెచ్ భావించింది. ఈ క్రమంలో నాలుగు మ్యాచుల్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉండగా.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన తక్కువ స్కోర్‌కే పరిమితం చేసింది.
ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే వర్షం ప్రారంభమైంది. దాంతో మ్యాచ్ ఫలితం తేలకుండానే రద్దయ్యింది. అంపైర్లు రెండు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. దాంతో సన్‌రైజర్స్ జట్టు నిరాశ తప్పలేదు. మరో వైపు ఢిల్లీ జట్టుకు ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉన్నాయి. మిగతా మ్యాచుల్లో రాణిస్తే ఢిల్లీ.. రెండోస్థానాకి చేరుకునే అవకాశం ఉంది. సోమవారం మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమైనా.. వర్షం ఆ జట్టును ఆదుకుంది. ఫలితంగా కీలకమైన ఒక పాయింట్ లభించింది. దాంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. ఢిల్లీ విజయంతో లక్నో సూపర్ జెయింట్స్‌కు కష్టాలు పెరిగాయి.
ఆ జట్టు మిగతా మూడు మ్యాచుల్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఏ ఒక్క మ్యాచ్‌లో ఓడినా ప్లేఆఫ్ ఆశలు గల్లంతయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 10 పాయింట్లు ఉన్నారు. మిగతా మూడు మ్యాచుల్లో విజయం సాధిస్తేనే ప్లేఆఫ్ రేసులో నిలిచే అవకాశం ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్ జట్టుకు ఇంకా మూడు మ్యాచులు మిగిలి ఉన్నాయి. పంజాబ్ కింగ్స్‌తో సొంత మైదానంలో ఆడుతుంది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్‌తో మ్యాచులున్నాయి.
ఈ మూడింట్లో విజయం సాధించడం అంత తేలిక విషయం కాదు. ఈ మూడు జట్లు పాయింట్ల పట్టికలో తొలి నాలుగుస్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ జట్టు 11 మ్యాచుల్లో ఆరు విజయాలు, నాలుగు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఐదోస్థానంలో ఉంది. ప్రస్తుతం జట్టు ఖాతాలో 13 పాయింట్లు ఉన్నాయి. మూడు మ్యాచుల్లో విజయం సాధిస్తే 19 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి చేరే అవకాశం ఉంటుంది. దాంతో ప్లేఆఫ్‌కు వెళ్తుంది. మూడు మ్యాచుల్లో ఓడితే మాత్రం నిష్క్రమిస్తుంది. ముంబయి జట్టుకంటే ముందు వరుసలో ఉంటుంది. పంజాబ్‌తో సమానంగా ఉండే అవకాశాలున్నాయి. అప్పుడు ఇరుజట్లకు రన్‌రేట్ కీలకంగా మారనున్నది.
అయితే, బెంగళూరు జట్టు మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓడిపోతే.. గుజరాత్ జట్టు మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో ఓటమిపాలైనా.. టాప్-టూలో చోటు దక్కించుకోవడం ఖాయం. ఢిల్లీ తర్వాతి మ్యాచ్ పంజాబ్‌తో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో డీసీ తప్పనిసరిగా గెలవాల్సిందే. ఆ తర్వాత ముంబయి, గుజరాత్ జట్లను ఓడించాలని కోరుకుంటుంది. ప్రస్తుతం ఈ సీజన్లో ఈ జట్లు మెరుగ్గా రాణిస్తుండడం ఢిల్లీకి సవాల్ లాంటిదే. దాంతో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు చెరో మ్యాచ్‌లో ఓడిపోవాలని ఢిల్లీ కోరుకుంటుంది.
ఢిల్లీ జట్టు రెండు మ్యాచ్‌లు గెలిచి 17 పాయింట్లతో ఉంటే.. కేకేఆర్, పంజాబ్‌తో పంజాబ్‌తో సమానంగా ఉంటుంది. ఆర్సీబీ, ముంబయి, గుజరాత్లో ఏవైనా జట్లు 18-18 పాయింట్లతో అగ్రస్థానానికి పోటీపడుతాయి. ఈ పరిస్థితుల్లో కేకేఆర్, ఢిల్లీ, పంజాబ్ జట్లు నెట్ రన్‌రేట్ ఆధారంగా నాల్గో స్థానానికి పోటీపడుతాయి. గుజరాత్ జట్టు ఇంకా నాలుగు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఆ టీమ్ తప్పనిసరిగా తొలి రెండు స్థానాల్లోకి చేరే అవకాశం ఉంది. ఆర్సీబీతో 22 పాయింట్లతో సమంగా ఉండే అవకాశం ఉంది.
ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ 20-20 పాయింట్లతో ఉంటే.. ముంబయి మంగళవారం గుజరాత్‌పై గెలిచి.. గుజరాత్ మిగిలిన మూడు మ్యాచుల్లో గెలిస్తే ముంబయి, గుజరాత్ పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉండే అవకాశం ఉంటుంది. అయితే, ఇది ఆర్సీబీ మిగతా మ్యాచ్ ఫలితాలపైనే ఆధారపడి ఉంటుంది. ముంబయికి ప్లేఆఫ్ చేరుకునేందుకు 18 పాయింట్లు సరిపోతాయి. అయితే, ముంబయి జట్టు పంజాబ్, ఢిల్లీ జట్లపై గెలిస్తే ఆ రెండు జట్లలో ఏ జట్టయినా గరిష్టంగా 17 పాయింట్లకే పరిమితమవుతాయి. ఢిల్లీ, ముంబయితో జరిగే మ్యాచుల్లో ఓడిపోయినా గుజరాత్‌కు ప్లేఆఫ్ వెళ్లేందుకు 18 పాయింట్లు సరిపోతాయి.
అయితే, ఈ సందర్భంలో జీటీ లక్నో, చెన్నైపై గెలవాల్సి ఉంటుంది. మరో వైపు ఆర్సీబీ, పంజాబ్, ఢిల్లీ, ముంబయి జట్లలో మూడు మాత్రమే సమానంగా లేదంటే అంతకన్నా ఎక్కువ పాయింట్లతో లీగ్ దశను దాటే అవకాశం ఉంది. ఎందుకంటే పంజాబ్, మంబయి, ఢిల్లీ జట్లు మూడు మ్యాచులు ఆడనున్నాయి. ముంబయి, గుజరాత్ రెండింటికీ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడానికి ఒక్కొక్కటి 16 పాయింట్లు అంటే ఒక్కొక్క విజయం సరిపోతుంది. ఇతర జట్ల ఫలితాలపైనే ఆధారపడి ఉంటుంది. రన్ రేట్ ముంబయి కీలకమవుతుంది. ప్రస్తుతం ఈ లీగ్‌లో ముంబయికి ప్లస్ 1.247 రన్‌రేట్‌తో ఉన్నది.