Road accident : ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ను తప్పించబోయి ప్యాసింజర్ బస్సు (Passenger Bus) మురుగు కాల్వలో పడిన ఘటనలో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఒడిశా రాష్ట్రం (Odisha state) బాలాసోర్ జిల్లా (Balasore district) లోని నునియాజోడి బ్రిడ్జి (Nuniajodi Bridge) పై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉండగా వారిలో 25 మందికి గాయాలయ్యాయి. మిగతా 10 మంది సురక్షితంగా బయటపడ్డారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు, పోలీసులు, ఒడిశా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. క్షతగాత్రులను బస్సు నుంచి బయటికి తీసి చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం క్రేన్ సాయంతో బస్సును బయటికి తీసుకొచ్చారు. ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ తప్పించబోయి బస్సు డ్రైవర్ కంట్రోల్ కోల్పోయినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
#WATCH | Balasore, Odisha: A passenger bus, carrying around 35 passengers, fell into a nearby drain after a tractor coming from the opposite direction collided with it on the Balasore-Fuladi road near Nuniajodi Bridge. 25 passengers injured. The injured were rushed to the… pic.twitter.com/edQUJ2CxKA
— ANI (@ANI) May 6, 2025