Srilanka Cricket : స్వదేశంలో న్యూజిలాండ్‌ను వైట్‌వాష్ చేసిన శ్రీలంక జట్టు ఇప్పుడు వన్డే, టీ20 సిరీస్‌కు సిద్ధమవుతోంది. కివీస్‌తో జరుగనున్న ఈ రెండు సిరీస్‌లకు లంక బోర్డు స్క్వాడ్లను ప్రకటించింది. 2022లో ఆసియా కప్ అందించిన దసున్ శనక(Dasun Shanaka)కు షాకిస్తూ సెలెక్టర్లు చరిత అసలంక (Charith Asalanka)ను మళ్లీ సారథిగా ఎంపిక చేశారు. ఇక లెఫ్ట్ హ్యాండర్ కేశాల్ పెరీరా వన్డే స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు. అనారోగ్యంతో బాధ పడుతున్న పేసర్ దుష్మంత్ చమీర సిరీస్‌లో ఆడడం లేదు.
శ్రీలంక, న్యూజిలాండ్‌ల మధ్య తొలుత పొట్టి సిరీస్ జరుగనుంది. దంబుల్లా స్టేడియం వేదికగా నవంబర్ 9న తొలి టీ20లో ఇరుజట్లు పోటీ పడనున్నాయి. అదే మైదనాంలో 10న రెండో మ్యాచ్‌తో టీ20 సిరీస్ ముగియనుంది. అనంతరం నవంబర్ 13న తొలి వన్డే.. 17, 19వ తేదీల్లో చివరి రెండు వన్డేలు నిర్వహించనున్నారు.
Sri Lanka have named their squads for the upcoming limited-overs series against New Zealand #SLvNZ pic.twitter.com/XthfCePfbx
— ESPNcricinfo (@ESPNcricinfo) November 6, 2024
వన్డే స్క్వాడ్ : చరిత అసలంక(కెప్టెన్), అవిష్క ఫెర్నాండో, పథుమ్ నిశాంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్, కమిందు మెండిస్, జనిత్ లియనగే, సదీర సమరవిక్రమ, నిశాన్ మధుష్క, దునిత్ వెల్లలాగే, వనిందు హసరంగ, మహీశ్ థీక్షణ, జెఫ్రే వాండర్సే, చమిందు విక్రమసింఘే, అసితా ఫెర్నాండో, దిల్షాన్ మధుశనక, మహ్మద్ షిరాజ్.
టీ20 స్క్వాడ్ : చరిత అసలంక(కెప్టెన్), పథుమ్ నిశాంక, అవిష్క ఫెర్నాండో, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్, కమిందు మెండిస్, దినేశ్ చండీమల్, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్సే, వనిందు హసరంగ, థీక్షణ, వెల్లలాగే, వాండర్సే, చమిందు విక్రమసింఘే, నువాన్ తుషార, పథిరన. బినుర ఫెర్నాండో, అసితా ఫెర్నాండో.
Kusal Perera returns to Sri Lanka’s ODI squad https://t.co/4xAelk9bfh
— ESPNcricinfo (@ESPNcricinfo) November 6, 2024
టీ20 వరల్డ్ కప్ అనంతరం కొత్త కెప్టెన్‌గా పగ్గాలు అందుకున్న అసలంక తన ముద్ర వేశాడు. సొంతగడ్డపై జరిగిన వన్డే సిరీస్‌లో భారత జట్టుపై ఆల్‌రౌండ్ షోతో లంకను గెలిపించాడు. దాంతో, కివీస్‌తో సిరీస్‌కు కూడా సెలెక్టర్లు, కోచ్ సనత్ జయసూర్యలు అతడిపైనే నమ్మకం ఉంచారు. ఈ సిరీస్‌లో లంక న్యూజిలాండ్‌ను చిత్తు చేస్తే.. అలసంక మరికొన్నాళ్లు సారథిగా కొనసాగే అవకాశముంది.