అమరావతి : ఏపీలోని కడప (Kadapa) జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజును (SP Harshavardhan Raju ) ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేయడం సంచలనం కలిగించింది . కడప జిల్లా పులివెందులకు చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని వదలి వేయడం పట్ల ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
ఈ విషయంపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu), డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా జిల్లా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాలమేరకు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కడప ఎస్పీ కార్యాలయానికి చేరుకుని ఎస్పీ హర్షవర్ధన్‌తో సమావేశమై వర్రా రవీంద్రారెడ్డి కేసు గురించి అడిగి తెలుసుకున్నారు.
వైసీపీ అధికారంలోకి ఉండగా రవీంద్రారెడ్డి విచ్చలవిడిగా చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్, వంగలపూడి అనితపై అసభ్యకర పోస్టులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సందర్భంగా అతడిపై మంగళగిరి, హైదరాబాద్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల విచారణకు రవీంద్రారెడ్డిని కడప పోలీసులు అదుపులోకి తీసుకని 41-ఏ నోటీసు ఇచ్చి వదిలిపెట్టారు.